చిన్నమ్మకు చిక్కులు తప్పవా? శశికళను ముప్పతిప్పలుపెట్టిన IPS రూప ఇప్పుడు కర్ణాటక హోం శాఖ కార్యదర్శి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది.

అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన చిన్నమ్మ శశికళ రేపో మాపో జైలు నుంచి విడుదలై వస్తారని అనుకునే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఐపీఎస్ అధికారుల ట్రాన్సఫర్ లు అన్నాడీఎంకే శ్రేణుల్లో కలవరం రేపాయి.పరప్ఫణ అగ్రహార జైలులో చిన్నమ్మ లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టి సంచలనం సృష్టించిన ఏపీఎస్ అధికారి రూప తాజా బదిలీల్లో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ పరిణామం చిన్నమ్మ విడుదలపై పడుతుందని అన్నా డీఎంకే వర్గాలు భయపడుతున్నాయి.

2017 నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే చిన్నమ్మ పెరోల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత జైలుకే పరిమితమయ్యారు. ఈ నేపధ్యంలో శశికళ ముందస్తుగా జైలు నుంచి విడుదలవుతారనే వార్తలు వెలువడ్డాయి.ఆమె కోసం పోయేస్ గార్డెన్ లో ఓ బంగ్లా సైతం సిధ్దం చేస్తున్నారు. శశికళ బయటకు రావటమే ఆలస్యం అన్న ధీమాతో ఉన్న ఆమె ప్రతినిధి దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలకూ పెద్ద షాకే తగిలింది.

ముందస్తుగా బయటకు రావటం అనే మాట పక్కన పెట్టి అస్సలు ఆమె ఎప్పుడు బయటకు వస్తుందో అనే చర్చ తెరమీదకు వచ్చింది. కారణం ..అప్పట్లో జైళ్ల శాఖ డీఐజీ గా ఉన్న రూప …శశికళ లగ్జరీ జైలు జీవితం పై ఆధారాలతో సహా ఆరోపణలు చేసారు. ఆమె ఇప్పుడు కర్ణాటక హోంశాఖ కార్యదర్శిగా నియమితులు కావడమే శశికళ వర్గాన్ని ఆయోమయంలోకి నెట్టింది.తమిళనాటే కాక ఎక్కడున్నా నా రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరించిన చిన్నమ్మ పరప్పణ అగ్రహార జైలులో కూడా అలాగే వ్యవహరించింది. 2017 లో అక్రమాస్తుల కేసులో శిక్ష పడి , జైలు జీవితం అనుభవిస్తున్న శశికళకు జైలులో రాచమర్యాదలు అందుతున్నాయనే వార్తలు తమిళ, కర్ణాటక రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.

అప్పట్లో జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రూప దీనికి సంబంధించిన ఆధారాలు, వివరాలు బయట పెట్టటంతో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ లగ్జరీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని కమీషన్ విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో రూప అనేక ఆధారాలను అందచేశారని తెలిసింది.జైలులో శశికళ లగ్జరీ లైఫ్ గురించి ఆరోపణల చేసిన రూపను …సినిమా కధలాగానే , అప్పటినుంచి ప్రాధాన్యం లేని పలు శాఖలకు బదిలీ చేస్తూ, ఎక్కువ కాలం ఎక్కడా ఉండనీయకుండా చేశారు. ప్రస్తుతం బెంగుళూరు డివిజన్ రైల్వే ఐజీగా ఉన్న ఆమెను హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో హోం శాఖ కార్యదర్శిగా నియమితులైన మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా రూప పేరు మారు మోగుతోంది.

READ  కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట!....యడియూరప్ప సన్నిహితురాలు డిమాండ్

చిన్నమ్మ విడుదలకు ముందు రూప హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా రావటంతో …. శశికళ లగ్జరీ జైలు జీవితం గురించి జరిగిన విచారణ నివేదికను మళ్లీ తెరపైకి తెస్తారనే భయం మన్నార్ గుడి వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తోంది. అదే కనుక జరిగితే చిన్నమ్మవిడుదల చిక్కుల్లోపడ్డట్టే అనే కలవరం చిన్నమ్మ శిబరంలోని అందరిలోనూ కనిపిస్తోంది. హోం శాఖ కార్యదర్శి రూప రూపంలో చిన్నమ్మకు చిక్కులు రాకూడదని శశికళ వర్గం యత్నాలు చేస్తోంది.చిన్నమ్మ ఎటువంటి చిక్కులు లేకుండా బయట పడే మార్గం కోసం ఆమె వర్గం న్యాయనిపుణులతో సంప్రదిస్తోందని తెలుస్తోంది. చిన్నమ్మ విడుదల ఇప్పడు రూప దయాదాక్షిణ్యాల మీద ఆధార పడి ఉంది. రూప నియామకంతో ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూస్తే గానీ తెలియదు.

Related Posts