లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

65 ఏళ్లుగా స్నానం చేయని ‘మురికి‘ వీరుడు

Updated On - 12:35 pm, Tue, 19 January 21

Iran : worlds dirtiest man amou haji not bathed in 65 years : ఒక్కరోజు స్నానం చేయకపోతే చికాకు చికాకుగా ఉంటుంది. కానీ ఏళ్లకు ఏళ్లు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? అసలు అటువంటి మనుషులు ఉంటారా? అంటే..ఉన్నాడనే చెప్పాలి 65 ఏళ్లుగా స్నానం చేయని ఓ వ్యక్తి గురించి తెలిసాక..! అమౌ హాజి అనే 83 ఏళ్ల వృద్ధుడు గత 65 ఏళ్ల నుంచి స్నానం చేయటల్లేదు.

‘ఛీ..ఎలా ఉంటున్నాడబ్బా స్నానం చేయకుండా’అని అనిపిస్తోంది కదూ..కానీ అమౌ హాజికి మాత్రం స్నానం అంటేనే చిరాకు..కానీ అదే అలవాటుతో అతను ఓ రికార్డు కూడా క్రియేట్ చేశాడు. అదే ‘65 ఏళ్లుగా స్నానం చేయ్యకుండా..ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా రికార్డు సృష్టించాడు. అమౌ హాజి ఇరాన్‌లోని టెహరాన్ లోని  ఓ ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నాడు. 65 ఏళ్లుగా స్నానం చేయకుండా చాలా హాయిగా బతికేస్తూ..ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా చరిత్ర సృష్టించాడు.

కాగా..ఇన్ని దశాబ్దాల పాటు స్నానం చేయకుండా ఎలా ఉంటున్నావని అడిగితే అమౌ ఏం చెబుతాడో తెలుసా?..‘నాకు నీరు అంటే చాలా భయం. అందుకే ఇన్నేళ్లుగా స్నానం చేయట్లేదని..కానీ నీళ్లంటే భయమే అయినా నేను కూడా నీళ్లు తాగుతానని చెబుతాడు. రోజుకు ఐదు లీటర్ల నీరు మాత్రం తాగుతానని చెబుతాడు.

ఎడారి ప్రాంతంలో ఒంటరిగా నివసించే హాజికి మాంసాహారం అంటే ఎంతో ఇష్టం. పోర్కుపైన్‌ మాంసాన్ని ఇష్టంగా తింటాడట. ఇంట్లో చేసిన వంటకాలంటే అస్సలు ఇష్టం లేదట. ఎన్నో ఏళ్లుగా తాను ఇలా మురికిగానే జీవిస్తున్నానని అంటాడు.కానీ హాజీకి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాధులు సోకలేదట. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెబుతాడు. అమౌకు సిగరెట్‌,చుట్ట తాగడం అంటే చాలా ఇష్టం.

గ్రామస్థులు తనకు సిగరెట్లు ఇస్తారట.. అవి అయిపోతే పొగాకు బదులుగా జంతువుల పేడను చుట్టలాగా చుట్టి దాన్ని ఎండబెట్టి చుట్టలాగా కాలుస్తాడని గ్రామస్థులు చెబుతున్నారు. హాజికి ఇళ్లు లేదు.. ఎడారి ప్రాంతంలోనే గుంతలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. సమీప గ్రామస్థులు అతడికి ఓ గుడిసె కట్టి ఇచ్చినా దాంట్లో ఉండడట. 65 ఏళ్లుగా స్నానంచేయకపోయినా 83 ఏళ్ల వయసులో కూడా హాజీ చాలా ఆరోగ్యంగా ఉండటం విశేషం.

ఇంటి వంటకాలంటే ఇష్టపడని హాజీ కుళ్లిపోయిన అడవిపంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటానని, రోజుకు అయిదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటానని చెప్తాడు. ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం చూసి స్థానికుల్ని ఆశ్చర్యపడుతుంటాడు. కానీ..ప్రపంచంలోనే అత్యంత మురికి వీరుడిగా రికార్డులకెక్కాడు 83ఏళ్ల అమౌ హాజీ.

పైగా గ్రామస్తులు సరదాగా..హాజీకి అద్దం ఇచ్చి చూసుకోమంటూ ఆ అద్దంలో తనను చూసుకుని తెగ మురిసిపోతాడట ఈ మరికి వీరుడు..నేను భలే అందగాడిని అనుకుని తెగ మురిసిపోతాడట..