లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

21 మంది ఉగ్రవాదులను ఉరితీసిన ఇరాక్

Published

on

Iraq hangs 21 terrorism charges : ఉగ్రవాదంపై ఇరాక్ ఉక్కుపాదం మోపుతోంది. దోషులుగా తేలిన 21 మంది ఉగ్రవాదులను ఇరాక్ ఉరితీసింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దోషులుగా తేలిన 21 మంది ఉగ్రవాదులు, హంతకులను ఇరాక్ ఉరితీసినట్టు పేర్కొంది. 2017లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు చర్యలను నిలువరించిన ఇరాక్ వరుసగా అనేక మంది ఉగ్రవాదులు, హంతకులను ఉరితీసింది.దక్షిణ ఇరాకీ నగరమైన నాసిరియాలోని జైల్లో ఉరితీసిన వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఉన్నారు. ఉత్తర నగరమైన తాల్ అఫర్‌లో జరిగిన ఆత్మహుతి దాడిల్లో డజన్ల కొద్దీ మృతిచెందారు.

ఎవరెవరిని ఉరితీశారో వారి గుర్తింపు వివరాలు, ఏ నేరానికి పాల్పడ్డారు అనేది ఇరాక్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇరాక్ వందలాది మంది జిహాదీలను మట్టుబెట్టింది.2014-2017 యుఎస్ మద్దతుతో సైనిక ప్రచారంలో ఇస్లామిక్ స్టేట్ యోధులను ఓడించినప్పటి నుంచి అనేక సామూహిక మరణశిక్షలు అమలు చేసింది. ఇరాకీ, ఇతర ప్రాంతీయ శక్తులు న్యాయ ప్రక్రియలో అసమానతలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

World Record : ఒక పావురం ఖరీదు రూ.14 కోట్లు..!!


నేరారోపణలు, దోషపూరిత విచారణలను మానవ హక్కుల సంఘాలు సైతం ఆరోపించాయి. దాంతో ఇరాక్ తాము అమలు చేసిన శిక్షలు న్యాయ పరమైనవిగా వెల్లడించింది.2014లో ఇరాక్‌‌లో మూడవ వంతును ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాతి మూడేళ్లలో పొరుగున ఉన్న సిరియాలోనూ ఇస్లామిక్ స్టేట్ తన ప్రభావాన్ని చూపలేక పరాజయం పాలైంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *