with IRTC for migrant laborers at Moradabad railway station, RSS has started its kitchen

వలస కూలీల కడుపు నింపటానికి..వంటవాళ్లుగా మారిన Rss కార్యకర్తలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనావైరస్ లాక్‌డౌన్ కష్టాల మధ్య వలస కార్మికుల కోసం IRTC (Indian Railways Catering and Tourism Corporation) సహకారంతో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్మికులు) ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ స్టేషన్ వద్ద వంటవాళ్లుగా మారారు. కార్యకర్తలంతా తమవంతుగా సహాయకులుగా మారారు. వంటలు చేస్తున్నారు.  

షెడ్యూల్ చేసిన రైళ్ల ద్వారా వచ్చే వలస కూలీలకు మే 31 వరకు ఆర్‌ఎస్‌ఎస్ కార్మికులు భోజనం సిద్ధం చేయటం కొనసాగిస్తూనే ఉంటారు. భోజనం వండిన తరువాత వాటిని ప్యాకింగ్ చేసి..వాటర్ బాటిళ్లను సిద్దం చేస్తారు. అలా ప్యాక్ చేసిన ఆహారం ప్యాకెట్..ఒక్కో వాటర్ బాటిల్ ను రైళ్లలో వచ్చే వలస కూలీలకు అందజేస్తున్నారు. 

అలా ప్రతీ రోజు చేస్తున్నారు. ఈ రోజు 10,000 మంది వలస కూలీలకు ఆహారంతో పాటు  1 వాటర్ బాటిల్ అందిస్తున్నామని ఓ కార్యకర్త తెలిపారు. ఇది మే 31 వరకు కొనసాగుతుందనీ..అప్పటి వరకు, మేము ప్రతి రోజు 10,000 నుండి 12,000 మందికి ఆహారాన్ని  అందజేస్తామనీ..దీని కోసం 400 మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నిత్యం పనిచేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ విభగ్ ప్రచార్ ప్రముఖ్ పవన్ జైన్ తెలిపారు. 

Read: పాతికేళ్లలో రూ.5వేల కోట్లు ఖర్చు చేసినా జరగని పని, లాక్ డౌన్ చేసి పెట్టింది.. స్వచ్చంగా మారిన యమునా నది

Related Posts