అలియా భట్ ఆర్ఆర్ఆర్‌కు మైనస్ కాబోతుందా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ నటి అలియా భట్ 2012 లో కరణ్ జోహార్ నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. దీని తర్వాత తన సత్తా నిరూపించుకునే గొప్ప చిత్రాలలో నటించింది. నటనతో మెప్పించింది. ఇప్పుడు అలియా త్వరలో మహేష్ భట్ సినిమా ‘సడక్ 2’ లో కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్‌లో నెపోటిజం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్‌ కిడ్స్‌ అయిన అలియా భట్‌, సోనాక్షి సిన్హా, అర్జున్‌ కపూర్‌ లాంటి వారిపై తీవ్రస్థాయిలో సుశాంత్‌ అభిమానులు విరుచుకుపడ్డారు. వారిని అన్‌ఫాలో చేశారు. అంతే కాకుండా సోషల్‌మీడియాలో తీవ్రంగా విమర్శించారు.

ఈ క్రమంలోనే ‘సడక్ 2’ ట్రైలర్ విడుదలైన తర్వాత, దానికి ఎక్కువగా నెగిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. దాదాపు 4 మిలియన్ల మంది డిస్‌లైక్‌ చేశారు. సుశాంత్‌ విషయంలో అలియాభట్‌, ఆమె తండ్రి మహేష్‌ భట్‌ చేసిన కామెంట్స్‌ విపరీతంగా ట్రోల్‌ అవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఇదిలా ఉండగా అలియా భట్‌ ప్రస్తుతం ణబీర్ కూపర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తుంది. అలియాభట్‌ వల్ల ఈ సినిమాపై నెగిటివ్‌ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అలియా రామ్ చరణ్ సరసన కనిపించనుంది.

Related Posts