బాధ్యతాయుతమా? బీజేపీ తంత్రమా? కేసీఆర్ సర్కార్ పై తెలంగాణ గవర్నర్‌ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్బార్ పెట్టలేదు కానీ జిల్లా పర్యటన చేశారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ డాక్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం, యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌తో విద్యా విధానాలపై రివ్యూ చేయడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు.కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు:
తాజాగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని, కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని ఆమె అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, పలు సూచనలు చేస్తూ ఇప్పటికి ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని గవర్నర్ తమిళిసై నేషన్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.

గవర్నర్ వ్యాఖ్యలు పొలిటికల్ గేమ్:
గవర్నర్ వ్యాఖ్యలను విమర్శలుగా చూడలేదు కానీ అధికార పార్టీ నేతలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారంట. దీని వెనుక పొలిటికల్ గేమ్ ఉందని టీఆర్ఎస్‌ పార్టీ భావిస్తోంది. తాము కరోనా కట్టడి విషయంలో ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా బీజేపీకి లాభం చేకూర్చేందుకే గవర్నర్ ఇలాంటి వాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఓ ఎమ్మెల్యే ఏకంగా ట్విటర్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రనికి గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళి సైని నియమించిన సమయంలో బీజేపీ నేతలు ఖుషీ అయ్యారంట. బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం గవర్నర్ అనే అర్థం వచ్చేలా అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సైతం మాట్లాడారంట.బీజేపీ కోసం పని చేసినా ప్రస్తుతం గవర్నర్ అన్న విషయం మర్చిపోవద్దు:
నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత కొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారం చేపట్టవచ్చని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం.. తెలంగాణకు గవర్నర్‌గా బీజేపీ నేత తమిళిసైను పంపారనేది కొంతమంది బీజేపీ నేతలు సన్నిహితులతో చెప్పారనే వార్తలు వచ్చాయి. తాజాగా గవర్నర్ తమిళి సై పై టీఆర్ఎస్ నేతల వాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. గతంలో ఆమె భారతీయ జనతా పార్టీ కోసం పని చేసినా ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ అన్న విషయం మరచిపోవద్దని హితవు పలుకుతున్నారు. బీజేపీ నిత్యం చేసే ఆరోపణలకు తాజాగా గవర్నర్ మాటలు బలం చేకూర్చేలా ఉండడటంతో ఆ పార్టీ కార్యకర్తలు సైతం జోష్‌గా ఉన్నారట. తమ నాయకులు అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను వాడుతున్నారని కమలదళం చెవులు కొరుక్కుంటోంది.

మునుముందు మరిన్ని అస్త్రాలు ఉపయోగించనున్న బీజేపీ:
మునుముందు మరిన్ని అస్త్రాలను ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే రోజులన్నీ బీజేపీకి మంచి రోజులంటూ పార్టీ నేతలు కేడర్‌లో విశ్వాసం నింపుతున్నారట. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ పదవిని ఉపయోగిస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తుందనే విమర్శలున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి రాజకీయాలకే తెర తీసిందంటున్నారు టీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు. మరి భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిందే.Related Tags :

Related Posts :