చైనా ఇష్యూ కూడా ‘ACT OF GOD’ఏనా? : రాహుల్ గాంధీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

\
తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడు చర్యలు చేపడుతుంది? లేకపోతే అది కూడా “యాక్ట్​ ఆఫ్​ గాడ్”​ అనుకుని దేవుని ఖాతాలోనే వేస్తారా? అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.


జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావాన్ని యాక్ట్​ ఆఫ్​ గాడ్​ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..రాహుల్​. ఈ విమర్శలు చేశారు.


ఆగస్టు-27,2020న జీఎస్టీ 41వ మండలి సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కోవిడ్ అనేది యాక్ట్ ఆఫ్ గాడ్. కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు తగ్గింది. ఫలితంగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

Related Posts