is-sai-krishna-ready-to-blame-for-actress-sravani-suicide-dev-raj-reveals-key-points

Sravani suicide : సాయి కారణమా ? కీలక అంశాలు వెల్లడించిన దేవ్ రాజ్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

TV actor Sravani suicide case : బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రావడం లేదు. మిస్టరీగా మారిన ఈ కేసులో శ్రావణి చేసిన వీడియోలు ఒక్కొక్కటి వీడియోలు బయటకు వస్తున్నాయి. శ్రావణిని వేధించింది సాయి ? లేక దేవ్ రాజా ? అనేది తెలియరావడం లేదు. ఎస్ఆర్ నగర్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపడుతున్నారు.



దేవ్ రాజ్ ను గంటల తరబడి పోలీసులు విచారించారు. కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. అమ్మాయిలను సాయి ట్రాప్ చేస్తాడని, గతంలో తనను రక్తం వచ్చేలా కొట్టాడంటూ పోలీసులకు తెలియచేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, తనను శ్రావణి ఎంతగా ప్రేమించిందో..ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు.

సాయి కుటుంబసభ్యులతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే..ఇక్కడ దేవ్ రాజ్ కారణమని శ్రావణి కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు.



దేవరాజు పోలీసులకు ఇచ్చిన ఆడియో ఆధారాలు 10టీవీకి చిక్కాయి. సాయి, నిర్మాత అశోక్ బెదిరించిన ఆడియోలు కూడా ఇచ్చాడు. సాయి, ఆశోక్ ప్రోద్బలంతోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని, ఆ విషయాన్ని శ్రావణేనే చెప్పిందని దేవరాజు ఆడియో చూపించాడు..

Sravani suicide : మై లవ్ లీ హీరో దేవ్ రాజ్…శ్రావణి లెటెస్ట్ వీడియో వైరల్


శ్రావణి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని మొదట చెప్పిన దేవరాజు.. తర్వాత అతడికి శ్రావణికి మధ్య బ్యాంకు లావాదేవీలను పోలీసులు గుర్తించారు.



మరోవైపు విచారణకు హాజరు కావాలని సాయి రెడ్డి.. నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం విచారణకు హాజరు కానున్నారు. ఇతను శ్రావణి బ్రదర్ ఫ్రెండ్ అని చెబుతున్నారు.



శ్రావణి కుటుంబసభ్యులకు సన్నిహతంగా మెలుగుతుండే వాడు. శ్రావణి, సాయిలు కలిసి టిక్ టాక్ చేసిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సాయిను విచారిస్తే..కొంత చిక్కుముడి వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Tags :

Related Posts :