is-sex-really-good-for-your-skin

మీ చర్మ సౌందర్యానికి శృంగారంకూడా కారణమేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెక్స్‌కు కాంతివంతమైన చర్మానికి లింక్ ఉందనేది ఎప్పటికీ చర్చనీయాంశమే. ఇండియన్ సినిమాలు, ఆక్టాజెనరియన్ ఆంటీలు పెళ్లిళ్లలో చేసే ముచ్చట్లు ఇవే. సెక్సువల్ యాక్ట్ మహిళల్లో ఆరోగ్యవంతమైన చర్మాన్ని కలుగజేస్తుంది. నిజానికి ఇద్దరి మధ్య సంబంధం వారిలో రిలేషన్ ను బట్టి అలా చర్మం మారుతుందా అనేదానిపై జరిపిన స్టడీలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

ఎవరైతే మంచి సెక్స్ లైఫ్ అనుభవిస్తారో.. వారు కాంతివంతమైన చర్మన్ని, మెరిసే జుట్టును కలిగి ఉంటారట. ఇది నిజంగా నిజం. ఏ ఒక్కరో చెప్పిన మాట కాదు ఇది. రీసెర్చర్స్ టీం దీని గురించి చెప్పుకొచ్చారు. సెక్స్ అండ్ బ్యూటీ రిలేషన్ గురించి వివరించారు.

జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. మిచిగాన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఇలా అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈస్ట్రోజన్ లెవల్స్ అనేవి ఉత్పత్తి అవడం తగ్గుతూ ఉంటాయి. సెక్స్ చేసేవారిలో వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దాంతో యుక్త వయస్సుతో ఉన్నట్లుగా, తేమతో కూడిన చర్మమే కాక మృదువుగా కూడా తయారవుతుందట.

 

సెక్స్ అనేది హార్ట్ రేట్ ను లీడ్ చేస్తుంది. తద్వారా రక్త సరఫరా అనేది క్రమంగా పెరుగుతుంది. అంటే శరీరానికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అందుతుంది. అలా గ్లోయింగ్ స్కిన్ గా మారుతుంది. 10ఏళ్ల కంటే ఎక్కువగానే 3వేల 500మంది మహిళలు, పురుషులపై స్టడీ నిర్వహించారు. ‘జడ్జిల కమిటీ పార్టిసిపేట్ చేసిన సభ్యులను పరిశీలించారు. వారంతా అద్దంలో చూసి వారి వయస్సును చెప్పగలిగారు. అయితే సెక్స్ లో యాక్టివ్ గా ఉండే వారి వయస్సు నిజమైన వయస్సు కంటే కాస్త తక్కువే అని తెలిసింది.

Related Tags :

Related Posts :