is this a piece of chicken

ఇది చికెన్ ముక్క అనుకుంటున్నారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ ఫొటో చూడ‌గానే చికెన్ ముక్క అని లొట్ట‌లేయ‌కండి.. కేఎఫ్‌సీ చికెన్ అని భ్ర‌మ‌ప‌డ‌కండి.. అయితే ఇంత‌కీ అదేంటా! అని ఆలోచిస్తున్నారా? అది కేవలం ఓ రాయి మాత్రమే. అమేలియా రూడీ బ్రాస్‌లెట్ బిజినెస్ నిర్వ‌హ‌స్తుంది. ఇందుకోసం ఆమె ర‌క‌రకాల రాళ్లు సేక‌రిస్తుంది. ఈ క్ర‌మంలో రూడీకి త‌న‌ స్నేహితురాలు ఓ రాయిని ఇచ్చింది. దాన్ని చూడ‌గానే ఆమె ఒక్క క్ష‌ణం పాటు తత్త‌ర‌పాటుకు లోనైంది.

అది ఎంతో ప్రత్యేకంగా క‌నిపించ‌డంతో రాయి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా నెటిజ‌న్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చికెన్ అనుకుని నోట్లో ఊరిళ్లూరేలోపే దాని క్యాప్ష‌న్ చ‌దివి రాయి అని తెలుసుకుని ఉసూరుమంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఫొటోకు 2.8 ల‌క్ష‌ల లైకులు రాగా, వేలాది కామెంట్లు వస్తున్నాయి.

చికెన్ ఫ్రైను పోలిన రాళ్ల ఫొటో‌ను ప‌లువురు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు చీజ్ కేక్‌, బంగాళాదుంప‌, మాంసాన్ని పోలిన రాళ్ల ఫొటోలు ప్ర‌త్య‌క్ష‌మై ఆహార‌ ప్రియుల‌కు నోరూరించేలా చేస్తున్నాయి.

Read:లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన ప్రధానికి రూ.13,000 జరిమానా