లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పులి స్మోక్ చేస్తుందా ? వీడియో వైరల్

Published

on

tiger smoking : ట్రక్కులో పులికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్కులో నుంచి మెల్లిగా బయటకు వస్తోంది. దాని నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఒక్కసారిగా వాహనం నుంచి బయటకు రాగానే..మరింత దట్టంగా పొగలు రావడం కనిపిస్తోంది. దీంతో పులి ఏమైనా స్మోక్ చేస్తుందా ? అనే డౌట్ రావడం సహజమే. కానీ పులులు స్మోక్ చేయవు అంటారు. Parveen Kaswan, IFS అధికారి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

‘బంధవ్ గడ్ కు చెందిన ఈ టైగర్ స్మోక్ చేస్తుందా’ అని సరదాగా క్యాప్షన్ జత చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో దీనిని రికార్డు చేశారు. ప్రస్తుతం తీవ్రంగా చలి వీస్తున్న సంగతి తెలిసిందే. శ్వాస విడిచినప్పుడు నోట్లో నుంచి పొగలు రావడం సహజమే. అలాగే..రాత్రి వేళ కావడంతో పులి నోట్ల నుంచి పొగలు వచ్చాయి. బయటకు వచ్చాక మరింత మంచు ఎక్కువ కావడంతో దట్టంగా పొగలు రావడం కనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారింది. 31 వేలకు పైగా లైక్ లు వచ్చాయి.

బావిలో పడిన పులిని ఫారెస్టు అధికారులు సురక్షితంగా కాపాడారు. మళ్లీ అడవిలోకి వదిలారు. ఈ పులి బావిలో నుంచి రక్షించినదే అంటే ఆశ్చర్యపోతారు..కదూ అంటూ Parveen Kaswan, IFS వెల్లడించారు. దీంతో అటవీ అధికారులను నెటిజన్లు ప్రశంసించారు.