ఛాతిలో నొప్పిగా ఉంటే.. అది కరోనా లక్షణమా? క్లారిటీ ఇచ్చిన వైద్యులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీ ఛాతిలో తరచుగా నొప్పి వస్తుందా? అది కరోనా లక్షణమోనని భయాందోళనకు గురవుతున్నారా? అయితే ఛాతిలో నొప్పి అనేది కరోనా లక్షణాలతో సంబంధం ఉందో లేదో వైద్యులు పలు కారణాలను వెల్లడించారు. వాస్తవానికి కోవిడ్-19 సోకిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాల్లో జ్వరం, దగ్గు, తీవ్ర అలసట, వాసన రుచి కోల్పోవడం, గ్యాస్టిక్ సమస్యల్లో ఒకటైన డయోరియా వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇప్పటివరకూ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అధికారి వెల్లడించిన ప్రకారం.. కోవిడ్-19 లక్షణాల జాబితాలో ఛాతి నొప్పి గురించి ఏమి లేదు.. రెస్పిరేటరీ (శ్వాకోస వ్యాధి) సమస్య కారణంగా కూడా ఛాతినొప్పి రావొచ్చు.. అంతేకాదు.. వైరస్ తాలుకూ ఇతర లక్షణాలు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా గుర్తించారు..చాలామంది కరోనా రోగుల్లో స్కిన్ ర్యాష్, హెయిర్ లాస్ అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాస్తవానికి కరోనా వైరస్ కారణంగా ఛాతినొప్పి రాదు.. ఇది ప్రభావంతమైన లక్షణం మాత్రం కాదని వైద్యులు అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సమయంలో కోవిడ్-19 సోకిన చాలామందిలో ఛాతినొప్పి ఉందని సోషల్ మీడియా వేదిగా తమ అనుభవాలను పంచుకున్నారు. భయాంకర ఛాతినొప్పి, తీవ్రమైన తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కరోనా లక్షణాలతో సంబంధం ఉండే అవకాశం ఉందంటున్నారు. చాలామందిలో బాగా దగ్గడం కారణంగా ఛాతిలో నొప్పి వస్తుందని వైద్యులు గుర్తించారు. ఛాతిలో నొప్పి అనేది కొన్నిసార్లు కరోనా లక్షణం కూడా కావొచ్చునని అంటున్నారు..

కోవిడ్-19 అధికారిక లక్షణాలు ఏంటి? :
CDC సూచించిన జాబితా ప్రకారం.. కోవిడ్-19 సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి..
* జ్వరం లేదా నొప్పులు
* దగ్గు
* శ్వాస తీసుకోలేకపోవడం లేదా ఊపిరి ఆడకపోవడం
* అలసట
* కండరాల నొప్పులు లేదా ఒళ్లు నొప్పులు
* తలనొప్పి
* రుచి లేదా వాసన కోల్పోవడం
* గొంతులో నొప్పి
* ముక్కు కారడం (జలుబు)
* వికారం లేదా వాంతులు
* డయేరియాఛాతిలో నొప్పి.. కరోనా సాధారణ లక్షణమా? :
CDC జాబితా ప్రకారం.. కోవిడ్-19 లక్షణాల్లో ఛాతి నొప్పి కూడా ఒకటి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జాబితాలో ఛాతి నొప్పి లక్షణం కరోనా వైరస్ తీవ్ర లక్షణంగా పేర్కొంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, శ్వాస అందకపోవడం, ఛాతిలో ఒత్తిడి, మాట్లాడలేకపోవడం వంటివి లక్షణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే వైద్యసాయం తీసుకోవాలని WHO సిఫార్సు చేస్తోంది. కరోనా సోకిన 164 మంది బాధితుల్లో 35శాతం మందిలో ఛాతి నొప్పిగా ఉండటం లేదా అసౌకర్యంగా ఉన్నట్టు లక్షణాలను గుర్తించామని CDC నివేదికలో పేర్కొంది.

READ  వాటర్ ట్యాంకర్‌తో వరద నుంచి టోక్యో సేఫ్.. భూగర్భంలో భారీ ఐడియా!!

ఛాతిలో నొప్పిగా ఉంటే కరోనా సోకినట్టేనా? :
ఛాతిలో నొప్పిగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.. నిరంతరయంగా గట్టిగా దగ్గినప్పుడు కూడా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది.. ఎక్కువ సార్ల దగ్గడం కారణంగా ఛాతి కండరాలు పట్టేసి నొప్పిగా అనిపిస్తాయి. ఊపిరితిత్తుల ప్రాంతంలో ఒత్తిడి లేదా గుండె సంబంధిత సమస్య కారణంగా కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. ఈ లక్షణంతో పాటు జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం వంటి ఇతర శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తే మాత్రం కరోనా లక్షణాలుగా అనుమానించవచ్చు. తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించి సంబంధిత టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.గుండె జబ్బు ముప్పు ఉన్నవారిలోనూ తరచూ ఇలా ఛాతిలో నొప్పి వస్తుంటుంది. అసాధారణ స్థితిలో ఛాతిలో నొప్పి వస్తే మాత్రం అది గుండెనొప్పికి దారితీయొచ్చు. ఆకస్మాత్తుగా వచ్చే ఛాతి నొప్పిని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు.. ఛాతిలో నొప్పికి గల కారణాలు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలని Dr. Swaminathan సూచిస్తున్నారు. అది గుండెనొప్పికి సంకేతమైనా కాకపోయినా సాధ్యమైనంత తొందరగా వైద్యున్ని సంప్రదించి చెకప్ చేసుకోవాలని సూచించారు.


Related Posts