లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

అదరగొట్టిన ఇషాన్ కిష‌న్.. 94 బంతుల్లో 173 పరుగులు

Updated On - 5:41 pm, Sat, 20 February 21

Ishan Kishan Slams 173 from 94 Balls in Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ బ్యాట్సమన్ ఇషాన్ కిషన్ అదరగొట్టేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 94 బంతుల్లో 173 పరుగులు సాధించాడు. మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఎడమ ఛాతి వాటంతో ఇషాన్ బ్యాటింగ్ ఝళిపించాడు.

ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో 11 సిక్సులు, 19 ఫోర్లతో రెచ్చిపోయాడు. తన ఛాంపియన్ షిప్ లో ఇప్పుడు ఏడో అత్యధిక స్కోరు. ఇషాన్ విజృంభణతో 50 ఓవ‌ర్ల టోర్నీల్లో జార్ఖండ్ అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసింది.


జార్ఖండ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 422 పరుగులు నమోదు చేసింది. గ‌తంలో విజ‌య్ హ‌జారే ట్రోఫీలో అత్య‌ధిక స్కోర్ సాధించిన ఘ‌న‌త మ‌ధ్య‌ప్ర‌దేశ్ సాధించింది. 2010 టోర్నీలో రైల్వేస్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ 6 వికెట్ల‌కు 412 పరుగులు చేసింది.


విజ‌య్ హ‌జారే టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు చేసిన వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిష‌ణ్ అవతరించాడు. తొలి హాఫ్ సెంచ‌రీని 40 బంతుల్లో పూర్తి చేసిన ఇషాన్‌… భారీ సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషాన్ దంచికొట్టుడుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *