భారత్ లోని 12 రాష్ట్రాల్లో ‘మోస్ట్ యాక్టీవ్’గా ISIS

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐసిస్‌ ఉగ్రసంస్థ చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ‌కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ ఉన్నాయి. ఈ 12 రాష్ట్రాల్లో ఐసిస్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నయని తెలిపింది.


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా బుధవారం రాజ్యసభలో ఇదే విషయాన్నిచెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోని యువత ఐసిస్‌వైపు ఆకర్షితులవుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్‌ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్‌ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు తెలిపారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Related Posts