Home » పాత కారును పడేయలేక మినీ క్రేన్గా మార్చిన ఇస్రో ఇంజినీర్
Published
4 days agoon
Daewoo Matiz: వృత్తి రీత్యా ఇస్రో ఇంజినీర్ అయిన బెన్ జాకోబ్.. తన పాత కారుపై మమకారం చంపుకుని పారేయలేక.. తక్కువ రేటుకు అమ్ముకోలేక కొత్త ప్రయోగం చేయాలనుకున్నాడు. అతని ఓల్డ్ కారును మినీ క్రేన్ గా మార్చేశాడు. ఇండియాలో ప్రొడక్షన్ ఆగిపోయిన మోడల్ డేవో మ్యాటిజ్. చూఝాట్టుకొట్టాలో ఉండే ఇంజినీర్.. ఈ మినీ క్రేన్ ను 14అడుగుల వరకూ ఎత్తు వరకూ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇది మొత్తం చేయడానికి అతనికి అయిన ఖర్చు కేవలం రూ.70వేలు మాత్రమే. కమర్షియల్ క్రేన్ కొనడానికి దాదాపు రూ.20లక్షల వరకూ ఖర్చు అవుతుంది. రెండు నెలలు కష్టపడి మ్యాటిజ్ కారును క్రేన్ చేశాడన్నమాట. 1998మోడల్ అయిన ఈ కారును కూడా కొన్నేళ్ల క్రితం అతని భార్య జీజా కొనుక్కున్నారట. అవును అది 20ఏళ్ల క్రితం వెహికల్. దానిని పడేయడం అతనికి ఇష్టం లేదు.
దీనిని కాస్త ఉపయోగపడే దానిలా చేద్దామనుకున్నా. అందుకే చాలా ఐడియాలు చెక్ చేశా. చివరికి ఒక దాంతో సెటిల్ అయ్యా. 1.1 టన్నుల కారు నిర్మాణం దాదాపు ఇంజినీరే పూర్తి చేశాడట. చాలా ఎక్విప్ మెంట్ ను సొంత వర్క్ షాప్ నుంచి రెడీ చేసుకున్నాడు.
ఇదంతా కరోనా వైరస్ లాక్ డౌన్ టైంలో మొదలుపెట్టాడు. కానీ, అడిషనల్ పార్ట్స్ కోసం ట్రై చేయగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందుల కారణంగా పని ఆలస్యమైందని తర్వాత వాటిని గుజరాత్ నుంచి తెప్పించుకున్నట్లు చెప్పారు. మే నెలలో మొదలుపెట్టిన ప్రాజెక్టుకు మొత్తం 2నెలలు కష్టపడి ఆగష్టు 2020కల్లా ఫినిష్ చేయగలిగాడట.
సొసైటీలో ఇటువంటి ఇన్వెన్షన్లు చాలానే జరిగాయి. ప్రతి ఒక్కరూ రూ.20 లక్షలతో మినీ క్రేన్ కొనుగోలు చేయలేరు కదా. గ్రామాల్లో ఇటువంటివి వాడుకోవచ్చు. కేవలం రూ.70వేలకే ఇది రెడీ అయింది. డేవో మోటర్సా దీని ఆపరేషన్స్ 2003-04లోనే ఆపేసింది.