IT attacks 2 thousand crores ? 2.36 Lakhs ? Why Chandrababu mouth is not open

ఐటీ దాడులు 2 వేల కోట్లా…? 2.36 లక్షలా…? బాబు నోరు విప్పడం లేదు ఎందుకు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చంద్రబాబు మాజీ పీఏ ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా రాజకీయ వేడి రాజేస్తూనే ఉన్నాయి. రెండు వేల కోట్లు అక్రమ సొత్తు దొరికిందని వైసీపీ రాద్ధాంతం చేస్తుంటే… కేవలం 2 లక్షల 63 వేలు మాత్రమేనంటూ తాజాగా టీడీపీ తెగ స్పందిస్తోంది. నిజానికి ఐటీ అధికారులకు దొరికిన అక్రమ సొమ్ము 2వేల కోట్లా…? 2.36 లక్షలా…? ఎవరి మాటలో నిజముంది…? ఐటీ దాడులపై ఇంతవరకూ చంద్రబాబు నోరువిప్పకపోవడానికి కారణమేంటి…?

ఏపీలో ఐటీ హీట్ ఇంకా చల్లారలేదు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్నటిదాకా వైసీపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పీఏతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు, లోకేశ్‌ను విచారిస్తే 2వేల కోట్లు కాదు లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతుందంటూ మాటల యుద్ధానికి దిగారు. 

తాజాగా శ్రీనివాస్ ఇంట్లో దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు తెలియజేస్తూ ఐటీ అధికారులు పంచనామా నివేదికను విడుదల చేశారు. ఈ సోదాల్లో 2 లక్షల 63వేల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ పేర్కొంది. దీంతో మొన్నటిదాకా శ్రీనివాస్‌ ఇష్యూలో కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ నేతలపై ఎదురుదాడికి దిగారు. 

ఐటీ దాడులను వైసీపీ నేతలు రాజకీయం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. టీడీపీకి వ్యతిరేకంగా అవాస్తవాలను పదేపదే ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయడపడటంతో వైసీపీ నేతలు నోరు మెదలేకపోతున్నారన్నారు దేవినేని ఉమా. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఐటీ దాడుల్లో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల గుట్టు బయట పడిందంటూ వైసీపీ నాయకులు అసత్యప్రచారం చేశారని మండిపడ్డారు బోండా ఉమా. ఐటీ దాడులపై అసత్య ప్రచారం చేసిన వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఇటు టీడీపీ నేతల వ్యాఖ్యలను మంత్రి బొత్స తిప్పికొట్టారు. ఐటీ దాడుల్లో బయటపడింది 2 వేల కోట్ల రూపాయలు కాకపోతే ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. మొత్తంగా శ్రీనివాసరావు ఇళ్లపై ఐటీ దాడులతో ఏపీలో రాజకీయ రచ్చ నెలకొంది. ఎలాంటి తప్పుచేయపోతే చంద్రబాబు ఎందుకు స్పందిచట్లేదని వైసీపీ ఆరోపిస్తుంటే నిజాలు ఎలాగు తెలుస్తాయి కాబట్టే బాబు మాట్లాడట్లేదంటూ టీడీపీ వాదిస్తోంది. 

Related Posts