nayeem gangster

నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు ఐటీ యత్నాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నయీం ఆస్తుల విలువ రూ.1200 కోట్లు….. నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు పిటీషన్ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ

హైదరాబాద్: సెటిల్మెంట్లు, భూకబ్జాలు, బెదిరింపులు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండి పోలీసు కాల్పుల్లో చనిపోయిన నయీం ఆస్తుల విలువ సుమారు రూ.1200 కోట్లుగా లెక్క వేశారు అధికారులు. 1015 ఎకరాల భూమి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గోండ జిల్లాల్లో సుమారు 40ఇళ్ల స్ధలాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు, బంగారం, వెండి,కార్లు, వెరశి 1200 కోట్లు రూపాయల ఆస్తులు తన బినామీల పేర కూడబెట్టాడు గ్యాంగ్ స్టర్ నయీం.
2016 ఆగస్టు 8న షాద్ నగర్ లో పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన నయీం కేసు విచారణ చేపట్టిన సిట్ అధికారులు  నయీం కు చెందిన .గోవాలో విల్లా,మహారాష్ట్రలో గెస్ట్‌హౌజ్‌, హైదరాబాద్‌, భువనగిరి, నల్లగొండ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ లు ఇళ్లు,ఇళ్ల స్ధలాలకు చెందిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు సేకరించిన సమాచారాన్ని తీసుకున్న ఆదాయపన్ను శాఖ  అధికారులు నయీం ఆస్తులు  బినామీల పేర్లోతో ఉన్నట్లు కనుగొన్నారు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్ లోని ఇల్లు నయీం బావమరిది సాజిద్‌ పేరుతో ఉన్నట్లు గుర్తించారు.  నయీం ఇంట్లో వంటమనిషి ఫర్హానా పేరుతో దాదాపు 40 ఇళ్ల స్తలాలు రిజిష్టేషన్ చేయించాడు. సిట్ తో పాటు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులుకూడా ఈ కేసును విచారిస్తున్నారు.
నయీం తో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కోన్న పోలీసు అధికారులు, కిందిస్దాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు  878మందిని విచారించింది.  125మంది నయీం అనుచరులను అరెస్టు చేశారు. నయీం ఆస్తుల అటాచ్ చేసేందుకు ఐటీ శాఖ రంగం సిధ్దం చేసింది. సిట్ నివేదిక ప్రకారం  నయీం ఆస్తులు అనధికారికమైనవని, వాటికి ఆదాయ పన్ను చెల్లించలేదని తేల్చారు. ఎటువంటి ఆదాయ వనరులులేకుండా ఇంతఆస్తులను ఎలా సంపాదించారనే కారణంతోనూ, బినామీ ఆస్తుల నిరోధక చట్టం కిందా కేసు నమోదు చేశారు.  ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ ఢిల్లీలోని ఎడ్జ్యుడికేటింగ్‌ అథారిటీలో ఐటీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. 
నయీం ఆస్తుల వివరాలు
నయీం కేసు విచారణలో భాగంగా సిట్  అధికారులు నయీం కుసంబంధించిన ఇళ్లనుంచి భారీగా స్ధిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్‌ విచారణలో తేలింది. 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని సిట్‌  కనుగొంది. హైదరాబాద్‌లోని నయీం ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 8 లక్షల 52 వేల 400 రూపాయల నగదుతోపాటు సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, వేరు వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, సెల్ ఫోన్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

READ  పొంచివున్న ముప్పు : సాగర్ జలాలపై యురేనియం ప్రభావం

Related Posts