రెండు బిల్డింగులపై అమ్మాయిల టెన్నిస్.. ఒక్కసారిగా ఫెదరర్ ఎంట్రన్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ సంవత్సరం సోషల్ డిస్టెన్సింగ్ కామన్ అయిపోయింది. పరిస్థితులకు అలవాటుపడిపోయారు ప్రజలంతా. అయితే ఇది ఆటల్లో కూడా. ఏప్రిల్ లో ఇద్దరు యువతులు రెండు ఇళ్లపైకి ఎక్కి టెన్నిస్ ఆడుతున్న వీడియో వైరల్ అయింది. అదే స్థాయిలో మరో సర్‌ప్రైజింగ్‌ ఘటన జరిగి.. మరోసారి ఇంటర్నెట్ షేక్ అవుతుంది. ఇద్దరు గర్ల్స్ ఇంటి పైకి ఎక్కి ఫ్రెండ్లీ టెన్నిస్ మ్యాచ్ ఆడుకుంటుండగా మధ్యలో రోజర్ ఫెదరర్ దూరిపోయాడు.ఊహించని ఘటనలో ఫెదరర్ ఒక్కసారిగా రావడంతో నోరెళ్లబెట్టారు. ఇది వారికి లైఫ్ టైం మూమెంట్ గా నిలిచిపోతుందని అంటున్నారు. గ్లోబల్ ప్యాండమిక్.. లాక్‌డౌన్ తొలి దశలో 13ఏళ్ల విట్టోరియా, 11ఏళ్ల కారోలా ఓవర్ నైట్ లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయారు. వీడియోలో ఇటలీలోని లిగ్యురియా ప్రాంతంలో రెండు బిల్డింగులపైనా వారు టెన్నిస్ ఆడుతున్నట్లుగా ఉంది.

దాదాపు మూడు నెలల తర్వాత వారిద్దరినీ ప్రెస్ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఎందుకంటే ఈ వీడియో చివర్లో రోజర్ ఫెదరర్ కనిపించాడు. ‘ఆయన కనిపించగానే ఒక్కసారిగా దూకేయాలనిపించింది. సెకన్లలో అతను కనిపించగానే మేం నమ్మలేకపోయాం. ఫెదరర్ మా రూఫ్‌టాప్ ఉన్నాడనేది నమ్మబుద్ధి కాలేదు’ అని వారిద్దరూ ఆశ్చర్యంతో కేరింతలతో చెప్పుకొచ్చారు.ఫెదరర్.. అక్కడితో ఆగలేదు. వారిద్దరినీ.. రాఫా నాదల్ అకాడమీలో సమ్మర్ క్యాంప్ కోసం ట్రైనింగ్ కు ఎన్ రోల్ అవమని ఆఫర్ కూడా ఇచ్చాడు. ‘ఇది చాలా బాగా అనిపించింది. చాలా ప్లేసులలో ఆడా. కానీ ఇది నాకు ప్రత్యేకం. సంతోషం కోసం ఎక్కడైనా ఆడగలమని.. నాకు బెస్ట్ టైం దొరికిందని అన్నాడు ఫెదరర్.

Related Posts