italian restaurant serves fried air

గాలి మాటలు కాదు : ‘గాలి’ని అన్నంలా తినేస్తున్నారు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గాలిని బాండీలో వేగించేస్తున్నారు..అన్నంలా వడ్డించేస్తుంటే లొట్టలేసుకుంటు తినేస్తున్నారు. అదే అక్కడ ఫేమస్ ఫుడ్ కూడా. ఏంటీ? కామెడీ అనుకుంటున్నారా? కాదండీ బాబూ నిజమే..మేమేమన్నా తింగరోళ్లలా కనిపిస్తున్నామా? ఇదంతా నమ్మేయటానికి మా చెవిలో కాలిఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? అంటారా..నిజంగా నిజమండీ బాబూ..అక్కడ ‘గాలి’ని వేడి వేడి నూనెలో వేగించి మరీ ప్లేట్ లో పెట్టేస్తారు..దీన్ని అక్కడ ఫేమస్ ఫుడ్ కూడా..

వెనెటో  : గాలిని బాండీలో వేగించేస్తున్నారు..అన్నంలా వడ్డించేస్తుంటే లొట్టలేసుకుంటు తినేస్తున్నారు. అదే అక్కడ ఫేమస్ ఫుడ్ కూడా.  ఏంటీ? కామెడీ అనుకుంటున్నారా? కాదండీ బాబూ నిజమే..మేమేమన్నా తింగరోళ్లలా కనిపిస్తున్నామా? ఇదంతా నమ్మేయటానికి మా చెవిలో కాలిఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? అంటారా..నిజంగా నిజమండీ బాబూ..అక్కడ ‘గాలి’ని వేడి వేడి నూనెలో వేగించి మరీ ప్లేట్ లో పెట్టేస్తారు..దీన్ని అక్కడ ఫేమస్ ఫుడ్ కూడా..

ఏంటీ విడ్డూరం? కంటికే కనిపించని గాలిని బాండీలో ఫ్రై చేయటమేంటి అనుకుంటున్నారా? ఇదిగో అక్కడికే వస్తున్నా…దాన్ని ప్రత్యక్షంగా చూడాలి అంటే ఇటలీ వెళ్లాల్సిందే. ఇటలీలోని క్యాస్టెల్‌ఫ్రాంకో వెనెటో నగరంలో గల ఫెవా రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. స్వచ్ఛమైన ‘గాలి’ కోరుకునేవారు తప్పకుండా తమ రెస్టారెంట్‌కు రావాలని..కడుపు నిండా ‘గాలి’ని ఆరగించి వెళ్లండని రెస్టారెంట్‌ నిర్వాహకులు కస్టమర్లను కోరుతున్నారు. ఇదిగో మీకు మల్లేనే  ఇటలీ ప్రజలు కూడా నమ్మలేదు..కానీ దీంట్లో ఉండే విశేషం ఏమిటో తెలుసుకోవాలని నగర ప్రజలు  ఆ రెస్టారెంట్ కు క్యూ కట్టారు. ఆ ‘గాలి’ వంటకాన్ని చూసిన తరువాత…తిన్న తరువాత ఇప్పుడు పిలవకుండానే కస్టమర్లు గాలిని ఆరగించడానికి వెళ్తున్నారు. ఈ ‘గాలి’ వంటకాన్ని ‘ఎరియా ఫ్రిట్టా’ లేదా ‘ఫ్రైడ్ ఎయిర్’ అని పిలుస్తున్నారు. 

‘గాలి’ వంటకం తయారుచేయు విధానం..
కర్రపెండలం దుంప పైపొరను గుండ్రంగా చుట్టి కాసేపు మైక్రో ఓవెన్‌లో పెడతారు. అది గట్టిపడిన తర్వాత నూనెలో వేపుతారు. ఆ తర్వాత వాటిని మరో డిష్ లోకి తీసుకుని ‘ఓజోన్’ గాలిని నింపుతారు. అలా 10 నిమిషాల పాటు గాలి పంపుతారు. దీనికోసం స్పెషల్  పెర్‌ఫ్యూమ్‌ను కూడా వాడతారు. అనంతరం వాటిని దూదిపై ఉంచి కస్టమర్లకు వడ్డిస్తారు. ఆ దూదిని వాళ్లు ‘మేఘాలు’ అంటారు. 
దీని కాస్ట్ కూడా వెరీ స్పెషల్ ..
ఈ ‘గాలి’ వంటకం తయారీయే కాదు కాస్ట్ కూడా వెరీ వెరీ స్పెషల్. 30 అమెరికా డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.2011. ఈ ‘ఫ్రైడ్ ఎయిర్’ను ప్రారంభంలో కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఫ్రీగానే ఇచ్చేవారు. డిమాండ్ పెరగటంతో రెగ్యులర్ మెనూలో ఈ ‘గాలి’ వంటకం స్పెషల్ గా మారిపోయింది. మీక్కూడా ఈ ఈ ‘గాలి’ వంటకం టేస్ట్ చేయాలనుకుంటే వెంటనే వెళ్లిపోండి ఇటలీ. లేదా మీరెప్పుడైనా ఇటలీ వెళ్తే.. తప్పకుండా ‘గాలి’ రుచి చూడండి. కాదేదీ వంటకు అనర్హం కదూ..క్రియేషన్ వుండేలా గానీ దేనికీ ఏదీ అనర్హం కాదు అని నిరూపించటం మానవ మేధస్సుకు అలవాటే.
ఇటలీ,క్యాస్టెల్‌ఫ్రాంకో వెనెటో,ఫెవా రెస్టారెంట్‌, గాలి వంటకం, 

READ  బిగ్ బ్రేకింగ్ : భారత్ లో నాలుగో కరోనా మరణం

Related Posts