ఒక్క రోజులో 40 వేల కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Italy reports record 40,000 new Covid-19 cases : కరోనా ప్రపంచాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో తగ్గుముఖం పడుతోంది అనుకున్న క్రమంలో..మళ్లీ పలువురు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో 24 గంటల వ్యవధిలో 40 వేల కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అతిపెద్ద పెరుగుదల అని అంటున్నారు.



శుక్రవారం కొత్తగా 40 వేల 902 కేసులు నమోదయ్యాయని ఇటాలియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది. ఇటలీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1, 107, 303గా ఉంది. 550 మరణాలు సంభవించాయని, మొత్తం మృతుల సంఖ్య 44 వేల 139కి చేరుకుందన్నారు.



వైరస్ వ్యాప్తి తగ్గినా..ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత నియంత్రణ చర్యలు తీసుకోవాలని Health ministry, Gianni Rezza తెలిపారు. దేశ వ్యాప్తంగా 60 మంది రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరిపించామని, Campania, Tuscany ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అవసరమన్నారు. ఇటలీలో ఇప్పుడు ఆరు ప్రాంతాలు రెడ్ జోన్లు, 9 నారింజ, 5 పసుపు జోన్ లుగా వెల్లడించారు.

Related Tags :

Related Posts :