లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

భారత్ లో పొల్యూషన్ పై ట్రంప్ కామెంట్ ని ఖండించిన జో బైడెన్

Published

on

Joe Biden on Trump’s ‘filthy air in India’ comment నవంబర్-3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా… రెండు రోజుల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య నాష్‌ విల్లేలో రెండవ(ఇదే చివరిది) ప్రెసిడెన్షియల్ డిబెట్‌ జరిగిన విషయం తెలిసిందే. పర్యావరణ మార్పులపై ఇద్దరు నాయకులు చర్చించారు. అయితే, ఈ చర్చ సమయంలో భారత్‌ లో వాయుకాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని ‘మురికి’గా పిలిచారు. ‘మీరు మన స్నేహితులతో మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించే మార్గం కూడా ఇది కాదంటూ ఆదివారం బైడెన్‌ ట్వీట్‌ చేశారు. తాను, కమలా హారిస్‌ భారత్‌ తో అమెరికా భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని జో బైడెన్ తన ట్వీట్ లో తెలిపారు. అంతేకాకుండా, అమెరికా విదేశాంగ విధానాన్ని తిరిగి గౌరవప్రద స్థానంలో ఉంచుతామని బైడెన్ స్పష్టం చేశారు.కాగా, గురువారం నాటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్.. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు వెల్లడించిన ట్రంప్‌ త‌న నిర్ణయాన్ని స‌మ‌ర్థించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ పై విమర్శనాత్మకంగా మాట్లాడారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. కాలుష్య కారకాలను భారత్, చైనా, రష్యా దేశాలు విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని.. తద్వారా పర్యావరణం కలుషితం అవుతోందని ట్రంప్ విమర్శించారు. చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. అలాగే రష్యా, భారత్‌లను చూడండి అవి ఎంత మురికిగా ఉన్నాయో. అక్కడ గాలి కూడా మురికిగా ఉంటుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జో బైడెన్… ఒబామా-బైడెన్‌ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌-అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాం. అదే తరహాలో బైడెన్‌-హారిస్‌ పాలనలో మరింత ఎక్కువ భాగస్వామ్యంతో ఇరుదేశాల సంబంధాలను కొనసాగిస్తామంటూ బైడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వెస్ట్ వీక్లీ తాజా సంచికలో తన అభిప్రాయాన్ని రీట్వీట్ చేశాడు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ తో కలిసి నిలబడి, చైనాసహా మరే దేశం బెదిరింపులకు దిగకుండా శాంతి స్థాపనకు కలిసి పని చేస్తామన్నారు. తిరిగి మార్కెట్లను ప్రారంభించి, యూఎస్‌, భారత్‌ లో మధ్య తరగతిని వృద్ధి చేయడంతో పాటు వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాదం, అనువిస్తరణ తదితర సవాళ్లను కలిసి ఎదుర్కొంటామని జో బైడెన్‌ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *