Jabardasth Artists Arrested

వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్ – ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ వ్యభిచార గృహంపై పోలీసులు నిర్వహించిన దాడిలో జబర్దస్త్ నటులు అరెస్ట్..

విశాఖపట్నం : వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవ దారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు జరపగా ఈ దాడిలో ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరిద్దరు హైపర్ ఆది టీమ్‌లో స్కిట్స్ చేయడంతో పాపులర్ అయ్యారు.

కెరీర్ స్టార్టింగులో ఆ టైపు వీడియోల్లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై జడ్జిలతో సహా పార్టిసిపెంట్స్ అందరూ సెటైర్లు వేస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడడంతో జబర్దస్త్ టీమ్‌ షాక్‌కు గురైంది .(హైదరాబాద్‌కూ కరోనా – మాస్క్‌తో ప్రభాస్..)

12

Related Posts