లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమేడియన్లు

Published

on

Jabardasth comedians movie leaked online : సైబర్ కేటుగాళ్లకు వాళ్లు వీళ్లనిలేదు చిన్నపెద్ద సినిమా ఏదైనా సరే వీళ్ల బారిన పడక తప్పటంలేదు. కష్టపడి తీసిన సినిమా ధియేటర్ లో రిలీజ్ కాకముందే వీళ్లు ఆన్ లైన్ లో విడుదల చేసేస్తుంటారు. ఇటీవలి కాలంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం మాస్టర్  సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్ లైన్లో షికారు చేశాయి.

తాజాగా బుల్లితెర జబర్దస్త్ నటులు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ పాయింట్ బ్లాంక్ సినిమా కూడా లీకైంది. ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన ‘పాయింట్ బ్లాంక్’. సినిమాలో అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఇంతలో సైబర్ కేటుగాళ్లు విడుదలకు ముందే సినిమాను పలువెబ్ సైట్స్ , యూ ట్యూబ్ ఛానల్స్ లో అప్ లోడ్ చేసారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర దర్శక నిర్మాతలతో పాటు జబర్దస్త్ కమేడియన గడ్డం నవీన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *