Home » జీసస్‌గా జగపతి బాబు!
Published
1 month agoon
Jagapathi Babu: జగపతి బాబు జీసస్ గెటప్‌లోకి మారిపోయారు.. టాలీవుడ్లో అందాల నటుడు, నటభూషణ శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా అంతటి ఇమేజ్ తెచ్చుకున్న జగ్గు భాయ్, బాలయ్య ‘లెజెండ్’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో వరుసగా విలన్ ఆఫర్స్ అందుకుంటూ తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించారు..
తాజాగా ఆయన జీసస్‌లా మారి శిలువనెక్కారు. తలకు ముళ్ల కిరీటం, ఒంటి నిండా గాయాలతో శిలువపై వేలాడుతూ కనిపించి ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. జీసస్ గెటప్‌లో జగ్గుభాయ్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
— Jaggu Bhai (@IamJagguBhai) January 25, 2021