అటు ఇటు తిరిగి చివరకు జగ్గూభాయే ఫిక్స్ అయ్యాడు ‘పుష్ప’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Jagapathi Babu in Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీకి విలన్ కోసం భారీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నమొన్నటి వరకూ కోలీవుడ్ హీరో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని విలన్‌గా చూపిద్దామనుకున్న సుకుమార్ అది వర్కౌట్ అవకపోవడంతో బాలీవుడ్ వాళ్లను ట్రై చేశారు. వాళ్లుకూడా ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నారో ఏమో మరి.. ఎందుకొచ్చిన రిస్క్ అని కలిసొచ్చిన విలన్‌తోనే కానిచ్చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట. వివరాల్లోకెళ్తే..Pushpa‘పుష్ప’ చిత్రం చిత్తూరు ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే రిలీజ్ అయిన అల్లు అర్జున్ లుక్ ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది.
‘పుష్ప’ సినిమాలో బన్నీ రా లుక్‌లో మాస్‌గా కనిపిస్తున్నాడు. బన్నీనే అంత మాస్‌గా కనిపిస్తుంటే విలన్ ఇంకెంత ఊరమాస్ లుక్‌లో కనిపించాలి?.. అందేకే విలన్‌గా నటించబోయే యాక్టర్ గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్. మొన్న మొన్నటి వరకూ విజయ్ సేతుపతి అనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు చెయ్యలేక విజయ్ సినిమా నుంచి తప్పుకున్నారు.Jagapathi Babuవిజయ్ సేతుపతి సినిమా నుంచి విత్ డ్రా అయ్యాక ఇక ఇక్కడి విలన్లు ఎందుకులే, సినిమా ఎలాగూ ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి.. బాలీవుడ్ విలన్‌ని తీసుకుందాం అని డిసైడ్ అయ్యారట. ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్న సునీల్ శెట్టితో పాటు సంజయ్ దత్‌ని అనుకున్నారట. కానీ సంజయ్.. హెల్త్ ఇష్యూస్‌తో షూటింగ్స్‌కి ఎప్పుడొస్తారో క్లారిటీ లేదు. అందుకే మళ్లీ తెలుగులోనే సుకుమార్‌కి బాగా కలిసొచ్చిన జగ్గూభాయ్‌నే విలన్‌గా తీసుకుందాం అని దాదాపు ఫిక్స్ అయ్యారట.Jagapathi Babu

జగపతి బాబు తనలోని హీరోయిజంతో పాటు విలనిజాన్ని కూడా వివిధ కోణాల్లో స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అందులోనూ సుకుమార్ సినిమాలైన ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో అటు క్లాసీ విలన్‌గా, తర్వాత చరణ్‌తో చేసిన ‘రంగస్థలం’ లో ఎక్స్‌ట్రీమ్ మాసీ విలన్‌గా తన నట విశ్వరూపం చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ కూడా డిఫరెంట్ స్టోరీ కాబట్టి.. లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆగిపోవడం పైగా ఆరు నెలల తర్వాత మహబూబ్ నగర్ అడవుల్లో సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్లాన్ చెయ్యడంతో విలన్‌గా జగపతిబాబునే ఫిక్స్ చేసేద్దామని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.Jagapathi Babu

Related Tags :

Related Posts :