Home » కోవిడ్ నిబంధనలు బేఖాతరు : చిత్తూరు జిల్లాలో దర్జాగా జల్లికట్టు పోటీలు
Published
2 weeks agoon
Jallikattu competitions in Chittoor : చిత్తూరు జిల్లాలో దర్జాగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జల్లికట్టు జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు.
కోవిడ్ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా యువకులు పెద్ద సంఖ్యలో పోటీలో పాల్గొంటున్నారు. ఎద్దులను పట్టుకునేందుకు జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పోటీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అయితే ఊళ్లో ఇంత హడావుడి జరగుతున్నా పోలీసులు ఎక్కడా కనిపించలేదు.