Home » షారుక్ కు డాక్టరేట్ ఇచ్చేందుకు నిరాకరించిన కేంద్రం
Published
2 years agoon
By
vamsiబాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. షారుక్ కు డాక్టరేట్ ఇచ్చే విషయమై అనుమతి ఇవ్వాలంటూ జామియా మిల్లియా ఇస్లామియా (జేఎమ్ఐ) విశ్వవిద్యాలయం చేసుకున్న వినతిని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్ఆర్డీ) తిరస్కరించింది. ఇంతుకు ముందే షారుక్ 2016లో హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ఒక వ్యక్తి పలు మార్లు గౌరవ డాక్టరేట్ పొందకూడదనే కచ్చితమైన నిబంధనలు లేనప్పటికీ, ఇలా చేయడం మాత్రం ప్రోత్సహించదగ్గది కాదంటూ పేర్కొని అధికారులు డాక్టరేట్ ఇచ్చేందుకు నిరాకరించారు.
గతంలో షారుక్ జేఎమ్ఐ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్లో విద్యను అభ్యసించారు. అయితే పూర్తి హాజరు లేదనే కారణంతో చివరి సంవత్సరంలో ఆయన తుది పరీక్షలు రాయలేదు. ఈ క్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని షారుక్ నుంచి అనుమతి తీసుకున్న జేఎమ్ఐ ఆయన అంగీకారాన్ని జతచేస్తూ కేంద్ర మానవ వనరులశాఖకు వినతిని పంపింది. అయితే, జేఎమ్ఐ విజ్ఞాపనను ఇప్పుడు హెచ్ఆర్డీ తిరస్కరించింది. షారుక్ గతంలో బ్రిటన్లోని బెడ్ఫోర్ట్షైర్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. గత కొనేళ్లుగా షారుఖ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, సినిమాల్లో నటనకు గానూ అప్పుడు ఆయనకు గుర్తింపు లభించింది.
Read Also: డోంట్ ఫాలో : రంభ, రాశీ బ్యూటీ యాడ్స్ బ్యాన్
Read Also: సినీ పుత్రుడు : కోడి రామకృష్ణ మృతిపై పలువురు సంతాపం