Home » SI కావాలనుకున్నా.. నెల్లూరు అంటే ఇష్టం.. అందుకే పార్టీ పెట్టా : పవన్ కళ్యాణ్
Published
2 months agoon
By
vamsiనివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా.. పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్.. రైతులకు తక్షణ సహాయం అందివ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. మద్యపానం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలని, తక్షణమే సాయం చెయ్యాలని పవన్ డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో నెల్లూరుతో తనకు ఉన్న అనుబంధిన్ని పంచుకున్న పవన్ కళ్యాణ్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నెల్లూరు తన అమ్మ ఊరని, అక్కడే పుట్టి పెరిగినట్లు చెప్పారు. అందుకే నెల్లూరు అంటే ఎనలేని అభిమానం అని అన్నారు. మొక్కలంటే విపరీతమైన ప్రేమ అని నెల్లూరులోని ఇంట్లో చెట్లు లేకపోవడం వల్లనే అక్కడ ఉండలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు గొప్ప గొప్ప ఆశయాలేం ఉండేవి కాదని, SI కావాలని మాత్రం ఉండేదని అన్నారు. ప్రజలను రక్షించేందుకు ఖాకీ చొక్కా వేసుకోవాలని భావించినట్లు చెప్పారు.
సాటి మనిషికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ ప్రారంభించినట్లు చెప్పిన పవన్.. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా కీలకంగా పని చేసినట్లు స్పష్టం చేశారు. పదో తరగతి గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు చెప్పిన పవన్.. చదువు మధ్యలో ఆపినా.. చదవడం మాత్రం ఆపలేదని అన్నారు. ఇంటితోపాటు చుట్టాల ఇళ్లల్లోనూ రాజకీయ వాతావరణం కారణంగా రాజకీయ స్పృహ పెరిగిందని, సాటి మనిషికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.