లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో అర్థం వేరేనా?

Published

on

Pawan Kalyan Press Meet:తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 30, 144సెక్షన్‌లను ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టం అందలం ఎక్కిస్తే.. బుద్ధి మాత్రం మారలేదని వైసీపీని విమర్శించారు. సోషల్ పోస్టింగ్‌లపై కూడా నేరస్థులను అరెస్ట్ చేసినట్లు చేసి హింసిస్తున్నారని మండిపడ్డారు.

వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేదని, కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 142 దేవాలయాలపై దాడి ఘటనలు జరిగాయి.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో అర్థం వేరు.. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే మాట్లాడకూడదా? రాములవారి విగ్రహం తల నరికేస్తే.. సున్నితమైన అంశం కాబట్టి నేను అక్కడికి వెళ్లలేదు.. అధికార పార్టీ నేతలు తీరు మారాలి.

విగ్రాహాలు పోతే మళ్లీ చేయిస్తాం.. రాముడికి తలకాయ నరికేస్తే.. తల పెడతాం,.. అంటూ మాటలు మాట్లాడకూడదు.. ఈ మాట చర్చ్ విషయంలో జరిగితే అంటారా? మసీదులు విషయంలో జరిగితే మాట్లాకుండా ఉంటారా? హిందువుల పట్ల ఒకలా, ఇతర మతాల పట్ల ఒకలా స్పందించటం తప్పు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా? అని ప్రశ్నించారు.