లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

షేక్ చేస్తున్న జాన్వీ బెల్లీ డ్యాన్స్

Published

on

Janhvi Kapoor belly dance : కరీనా కపూర్ పాటకు జాన్వి కపూర్ బెల్లీ డాన్స్‌తో అదరగొట్టింది. ఇప్పుడీ వీడియో ఇంటర్‌నెట్‌లో సునామీలా మారింది. వీడియోలో జాన్వి బెల్లీ డ్యాన్స్ నైపుణ్యం మైమరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే గాబ్రియేలా రేంజ్‌లో బెల్లీ నృత్యంతో మెరుపులు మెరిపించింది ఈ కుర్రబ్యూటీ. న‌డుము తిప్పుతూ జాన్వీ క‌పూర్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆమె ప‌ర్‌ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరు మంత్రముగ్దుల‌వుతున్నారు.

సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న జాన్వీ సడెన్ గా ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇటీవల కొన్ని సరదా వీడియోలు చేసిన జాన్వి.. కొంత గ్యాప్ తర్వాత ఇలా బెల్లీ డ్యాన్స్ వీడియోతో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అశోకా చిత్రంలోని కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి బెల్లీ డాన్స్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. జాన్వీ నృత్య కదలికలతో పాటు ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్ మైమరిపించాయి. జాన్వీ బెల్లీ డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

ఫ్యాషన్‌, ఫిట్‌నెస్‌ పోస్టులతో తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు చేరువగా ఉండే జాన్వి ఇప్పుడు బెల్లీ డ్యాన్స్‌ వీడియోతో మెప్పించారు. భువికి దిగి వ‌చ్చిన ఏంజెల్‌లా బెల్లీ డ్యాన్స్‌ చేసింది ఈ బెల్లీ బ్యూటీ. జాన్వి షేర్‌ చేసిన వీడియోకు నెట్టింట్లో మంచి స్పందన లభించింది. నెటిజన్లు మాత్రమే కాకుండా మనీశ్‌ మల్హోత్ర, మహీప్‌ కపూర్‌, సంజయ్‌ కపూర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం జాన్విపై ప్రశంసల వర్షం కురిపించారు. సూపర్‌గా డ్యాన్స్‌ చేసిందంటూ వరుస కామెంట్లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *