లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

Published

on

janhvikapoors-gunjan-saxena-to-premiere-on-netflix

‘ధఢక్’ మూవీతో బాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ, ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూఅఫ్జానా, దోస్తానా 2’ సినిమాల్లో నటిస్తోంది. కాగా వాటిలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ మూవీ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ విషయాన్ని సినిమా యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌ ద్వారా తెలియచేసింది. ఈ సినిమా కోసం జాన్వీ, ఫ్లైట్ నడపడం సహా పలు ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్న సంగతి తెలిసిందే.

Gunjan Saxenaతన అమితమైన ధైర్య సాహసాలతో 1999 కార్గిల్‌ యుద్ధం సమయంలో గాయాలపాలైన సైనికులను విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్,అనంతరం అందరి నుండి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆమె చేసిన సాహసోపేతమైన పనికి మెచ్చి, అప్పటి ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్‌ని ఆమెకు ప్రకటించడం జరిగింది.

Gunjan Saxena: The Kargil Girlకాగా ఆ యుద్ధ సమయంలో జరిగిన ఘటనలు, అలానే ఆ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి భారత మహిళా పైలట్ అయిన గుంజన్ జీవితంలోని పరిస్థితులను గురించి వివరంగా ఈ చిత్రంలో చూపించనున్నారు. యువ దర్శకుడు శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జీ స్టూడియోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో జాన్వీ తండ్రిగా ప్రముఖ నటుడు పంక‌జ్ త్రిపాఠి నటించగా, మరొక నటుడు అంగద్ బేడీ జాన్వీకి సోదరుడిగా కనిపించనున్నాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *