లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఈ రోజు స్పెషల్ డే.. 21వ శతాబ్దం.. 21వ సంవత్సరం.. 21వ తేదీ

Published

on

January 21, 2021 is a Unique Day : జనవరి 21, 2021.. ఈ రోజు స్పెషల్ డే.. అవును.. మరి.. 21వ శతాబ్దం.. 21వ సంవత్సరం.. 21వ తేదీ.. స్పెషల్ డేనే కదా.. అందుకే ఈ రోజుకు అంత ప్రత్యేకత.. వందేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుంది. అక్టోబర్ 10, 2020.. (10102020) చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకున్నాం.. ఇలా ఎప్పటికీ మళ్లీ జరగదు.. చాలా అరుదుగా ఇలాంటి తేదీలు, నెలలు, సంవత్సరాలు కలిసి వస్తాయి.


న్యూమరాలజీ ప్రకారం.. చాలామందికి తమ పుట్టినతేదీలు, పెళ్లిరోజులు, ఏదైనా లక్కీ నెంబర్లు ఇలా ఎన్నో ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. అంతేకాదు.. ఈ రోజున మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.. నేషనల్ హగ్గింగ్ డే కూడా ఇదే రోజు.. నేషనల్ హగ్ యువర్ పప్సీ డే, ఉమెన్స్ హెల్తీ వేయిట్ డే కూడా ఇదే రోజు కావడం ఎంతో విశేషం.. ఈ 2021 ఏడాదికి మరో స్పెషల్ కూడా ఉంది.


శుక్రవారంతో మొదలై.. శుక్రవారంతో ముగిసే లీపు సంవత్సరం కూడా. 2010 ఏడాది పోలిన ఈ ఏడాది క్యాలెండర్‌ 2027, 2100లో మాత్రమే మళ్లీ ఒకేలా వస్తుంది. 21వ శతాబ్దంలో 21 ఏడాదిలో 21వ రోజు అంటూ ప్రతిఒక్కరూ ట్విట్టర్ వేదికగా అందరికి విషెస్ తెలియజేస్తున్నారు. వెరీ యూనిక్ డే అంటూ ట్వీట్లను నెటిజన్లంతా షేరింగ్ చేస్తున్నారు.


అంతేకాదు.. (21/21/2021).. ఈ రోజు రాత్రి 9:21 (21:21) స్పెషల్ టైం.. కూడా.. ఈ రోజు ఉదయం నుంచే అందరూ వాట్సాప్ మెసేజ్ లు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు స్పెషల్ డే విషెస్ అంటూ పంపుతున్నారు.