లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

సరికొత్త ట్రెండ్ ఇదే : వజ్రాలు, ముత్యాలతో లగ్జరీ మాస్క్‌లు..

Published

on

Japan luxurious style masks : ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కళలకు ప్రసిద్దిగాంచిన జపాన్.. కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో వినూత్నంగా ప్రయత్నిస్తోంది.

అందరిలా సాధారణ మాస్క్‌లు పెట్టుకుంటే ఏం బాగుంటుంది. ఖరీదైన మాస్కులతో ట్రెండ్‌కు తగట్టుగా జపనీస్ ట్రెండ్ సెట్టర్లు లగ్జరీ స్టయిల్‌లో కరోనా నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు.వజ్రాలు, ముత్యాలు పొదిగిన అత్యంత ఖరీదైన కరోనా కూల్ మాస్క్‌లను వాడుతున్నారు. చేతితో తయారుచేసిన మిలియన్ల ఖరీదైన మాస్క్‌లను ఆన్ లైన్‌లో విక్రయిస్తోంది. ఒక్కో లగ్జరీ మాస్క్ ఖరీదు (9,600 డాలర్లు ఉంటుంది) ఒక మిలియన్ యాన్ ధరకు విక్రయిస్తోంది.

గతవారమే Cox Co’s Mask.com అనే కంపెనీ ముత్యాలు, వజ్రాల మాస్క్‌ల సేల్ ప్రారంభించింది. కరోనా మహమ్మారితో కుదేలైన ఫ్యాషన్ రంగం మళ్లీ సేల్స్ ఊపందుకునేలా ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

వామ్మో.. బంగారంతో తయారుచేసిన సబ్బు ధర 2.07లక్షలు!!


వజ్రాల మాస్క్‌లను 0.7 క్యారెట్ డైమండ్, 300 ముక్కలకుపైగా Swarovski crystal, 330 జపనీస్ Akoya pearls నుంచి కొన్ని మాస్క్‌లను ముత్యాలతో అలకరించారు. కరోనా సంక్షోభంతో జ్యుయెలరీ, ఫాబ్రిక్ పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.జపాన్‌లో ఈ పరిశ్రమలపై కరోనా అధిక ప్రభావం పడింది. జపాన్ మునపటిలా ఫ్యాషన్ రంగంలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని కంపెనీ యజమాని Azusa Kajitaka వెల్లడించారు. రిటైలింగ్ గ్రూపు Aeon Co కంపెనీ Cox గత సెప్టెంబర్ నెలలోనే Mask.com ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించింది.ఈ వెబ్ సైట్ ద్వారా 500 Yen ప్రారంభ ధర నుంచి వజ్రాలు, ముత్యాలతో అలంకరించిన 200 రకాల లగ్జరీ స్టయిల్ మాస్క్‌లను విక్రయిస్తోంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాస్క్‌లుగా ఈ జపనీస్ లగ్జరీ స్టయిల్ మాస్క్‌లకు భారీ గిరాకీ ఉంది.18 క్యారెట్ల బంగారంతో 250 గ్రాముల బరువైన మాస్క్‌లను ఇజ్రాయెల్ జ్యుయెలరీ Yvel కంపెనీ 1.5 మిలియన్ డాలర్ల (ఒక డాలర్‌కు 104.4900 Yen) మాస్క్ లను తయారు చేసింది. ఇప్పుడు జపాన్ లో ఈ లగ్జరీ మాస్క్ లను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *