వైరల్ వీడియో: జూనియర్ ఎన్టీఆర్ పాటకు జపాన్ జంట స్టెప్పులు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు జపాన్‌లో కూడా ఉన్నారు. అక్కడ ఎన్టీఆర్ సినిమాలకు అభిమానుల సందడి బాగా ఉంటుంది కూడా. అయితే లేటెస్ట్‌గా ఓ జపనీస్ జంట ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలోని పాటకు స్టెప్పులేసి అలరించారు.

ఎన్టీఆర్, సమీరారెడ్డి నటించిన ‘అశోక్’ సినిమాలోని ‘గోల గోల’ పాట అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాట కోసం సినిమాను మళ్లీ మళ్లీ చూసినవాళ్లు కూడా ఉన్నారు. ఈ పాటకే ఓ జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటకు ఎన్టీఆర్, సమీరారెడ్డి చేసిన డ్యాన్స్ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు వీరు వేసిన స్టెప్పులు కూడా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలోని ‘గోల’ పాటకు జపాన్ జంట చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, సమీరల డ్యాన్స్ స్టెప్పులను అచ్చుగుద్దినట్టు దింపేశారు. క్యాస్ట్యూమ్స్‌ను కూడా దాదాపు అనుకరించారు. ఈ జంట డ్యాన్స్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముగ్ధులైపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Related Posts