వామ్మో.. ‘వయస్సునామి’ పాటకు జపాన్ జంట డ్యాన్స్ మామూలుగా లేదుగా అసలు!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Japanese Couple Dance to Jr NTR song: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ జెనరేషన్లో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ డ్యాన్సర్స్‌ ఎవరంటే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ల పేర్లే చెబుతారు. వీరి సినిమాల పాటలు ఇతర దేశాల్లో కూడా అక్కడక్కడా వినబడుతూ ఉంటాయి. ఇక యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ సినిమాలకు వ్యూస్ ఏ రేంజ్‌లో వస్తాయో చెప్పక్కర్లేదు.


ఇక ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి ఏంటో అనేది ప్రపంచానికి తెలిసింది. ఇతర దేశాల వారు కూడా ఇప్పుడు తెలుగు సినిమాలంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన తెలుగు హీరోల డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ పాటలతో జపాన్‌కు చెందిన ఓ జంట గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తుంది. హిరొ మునిఎరు అనే అతను తన భార్య పిల్లలతో కలిసి, తారక్ చిత్రాలలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.


ఇటీవల వీరు తారక్‌ ‘అశోక్’ సినిమాలోని ‘గోల గోల రంగోలా’ పాటకు, ఆ తర్వాత ‘సింహాద్రి’ చిత్రంలోని ‘చీమ చీమ చీమా’ పాటకు డ్యాన్స్ చేసి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్యామిలీ యంగ్‌ టైగర్‌ మరో చిత్రంలోని పాటతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈసారి వాళ్లు చేసిన డ్యాన్స్ మాములుగా లేదు అసలు..


‘కంత్రీ’ మూవీలోని ‘వయస్సునామి’ పాటకు ఎప్పటిలా సేమ్‌ టు సేమ్‌ ఎన్టీఆర్‌, హన్సికలా డ్రెస్సులు, డ్యాన్స్ చేయడమే కాకుండా.. అదే డ్యాన్స్‌తో ఇంటిలోని పనులు చేస్తూ మెప్పించడం విశేషం. ఫ్లోర్ తుడుస్తూ.. బాత్‌రూమ్ క్లీన్ చేస్తూ.. ఇలా స్టెప్పులను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేస్తూ వారు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Related Posts