Home » ఒలంపిక్స్ వాయిదా! : జపాన్ ప్రధాని
Published
10 months agoon
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్‌కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ క్రీడా సంబరం జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు జపాన్ ప్రధాని షింజో అబె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ 2020ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాయిదా వేయక తప్పదేమోనని జపాన్ ప్రధాని షింజో అబె అన్నారు. అయితే ఒలింపిక్స్‌ను రద్దు చేసే అవకాశం మాత్రం అసలు లేదని స్పష్టంచేశారు. కాగా, ఒలింపిక్స్ నిర్వహణకు ఉన్న వివిధ మార్గాలపై చర్చిస్తున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. అవసరమైతే ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తామని ప్రకటించింది. కాగా, ఇటీవలే టోక్యోలో ఒలింపిక్ జ్యోతిని ఆవిష్కరించారు. కరోనా కట్టడి అమల్లో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి దాదాపు 50వేలమంది క్రీడాభిమానులు హాజరవడం విశేషం.
కెనడియన్ ఒలింపిక్ కమిటీ (సిఓసి) మరియు కెనడియన్ పారాలింపిక్ కమిటీ (సిపిసి) ఈ ఏడాది ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడలకు తమ జట్లను పంపబోవని ఆదివారం ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆ ప్రకటనలో రెండు కమిటీలు…. తమకు అథ్లెట్స్ కమిషన్లు, జాతీయ క్రీడా సంస్థలు మరియు కెనడా ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయని తెలిపింది.