లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

ఇంటి ముందు మద్యం తాగి న్యూసెన్స్..ప్రశ్నించినందుకు వృద్ధ దంపతుల హత్య

Published

on

jarkhand Elderly Couple Death : మన ఇంటి ముందు ఎవరైనా అరుచుకుంటూ న్యూసెన్స్ చేసినా ఎవరన్నా మద్యం తాగి గలాటా చేస్తుంటే ఏం చేస్తాం..ఏంటీ గోల అవతలకు పొండి అంటాం. అలా అన్నందుకు ఓ వృద్ధ దంపతుల్ని దారుణం హత్య చేశారు కొంతమంది దుర్మార్గులు. ‌ప్రతీరోజు వారి ఇంటిముందుకు కూర్చుని నానా యాగీ చేస్తున్నవారిని ప్రశ్నించినందుకు ఆ వృద్ధ దంపతుల్ని హత్య చేసిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే..గుమ్లా జిల్లాలోని సత్పారా గ్రామంలో సైని గాప్ (70), ఫూలో దేవి (65) అనే వృద్ధ దంప‌తులు నివ‌సిస్తున్నారు. వారి ఇంటిముందు కొంత ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ప్రతీరోజు కొంతమంది మద్యం తాగుతున్నారు. అక్కడే తిష్టవేసి ఇష్టమొచ్చినట్లు తాగటం వాగటం..తాగి ఊరుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా అరవటం..ఫోన్ లో పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేయటం..బూతులు తిట్టుకోవటం..చేస్తున్నారు కొంతమంది మందుబాబులు.


పట్టపగలు దారుణ హత్య.. తల నరికిన దుండగులు


దీంతో ప్రతీరోజు వీరి గొడవతో విసిగిపోయిన సైని గాప్ గత ఆదివారం (నవంబర్ 15,2020) రోజు ‘‘తమ‌ ఇంటి వద్ద మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేయ‌వ‌ద్ద‌ని..దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోండి’’ అని చెప్పాడు. దాంతో కోపోద్రిక్తులైన వారిలో కొంద‌రు మందుబాబులు వారిని దారుణంగా కొట్టారు.

కొడుకు చేయి విరగ్గొడితే అల్లుడు నడుం విరగ్గొట్టాడు

వారి దెబ్బలు తాళలేక ఆ వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో వారికి తాగింది దిగిపోయింది. ఇక్కడ ఉంటే ప్రమాదమని అనుకుని అక్కడ నుంచి పరారైపోయారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి గాలింపు చేప‌ట్టారు.


ఈ ఘటన గురించి చుట్టు పక్కలవారిని ఆరా తీయగా ప్రతీ రోజు కొంతమంది ఇక్కడే మద్యం తాగుతూ నానా న్యూసెన్స్ చేస్తున్నారనీ కానీ ఎవ్వరూ వారిని ప్రశ్నించటానికి ధైర్యం చాలక వారి న్యూసెన్స్ భరించేవాళ్లమని కానీ అదేమని ప్రశ్నించినందుకు సైనీ గాప్ ను ఆయన బార్య దేవిలపై దాడి చేసారని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *