లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

జవహర్ నవోదయ విద్యాలయం : ఆరో తరగతికి ప్రవేశానికి దరఖాస్తు ప్రారంభం

Published

on

Jawahar Navodaya Vidyalaya notification:
రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం 2021-2022 విద్యా సంత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డేనియల్ రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలోని జేఎన్ వీ కార్యాలయంలో మంగళవారం(అక్టోబర్ 27,2020)న ఈ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వివరించారు.ఆరవ తరగతి ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 10, 2021న నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవటం కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. సహాయ కేంద్రం సహాయకులుగా పీ. శ్రీనివాసరావు– 9959513171, కే.మట్టారెడ్డి– 9490702185, భూప్‌సింగ్‌– 9390728928లతో సంప్రదించవచ్చు.  దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ డిసెంబర్ 15,2020.అర్హులెవరు?
మే 01,2008 నుంచి ఏప్రిల్ 30, 2012 మధ్య పుట్టినవారై ఉండి.. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి.రిజర్వేషన్లు ?
ఆరవ తరగతిలోని మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మిగిలిన 25 శాతం పట్టణ వాసులకు రిజర్వు చేస్తారు. మొత్తం సీట్లలో 1/3వ సీట్లు బాలికలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం SC, ST, ఓబీసీ, దివ్యాంగులకు సీట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు.జేఎన్‌వీ ప్రత్యేకతలు ఏమిటి?
కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి ద్వారా జేఎన్‌వీలు ఈ ప్రవేశాలను నిర్వహిస్తుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఇంగ్లిష్‌ మీడియం బోధన ఉంటుంది. జేఎన్‌వీ రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చాం. ఇంటర్మీడియట్ మెుదటి, రెండవ సంవత్సరం చదివే అమ్మాయిలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖచే నెలకు రూ. 2 వేల స్కాలర్‌షిప్‌ అందిస్తారు. అవంతి ఫెలోస్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీరికి జేఈఈ (జీ), నీట్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇవ్వడం జరగుతుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *