దేశవ్యాప్తంగా జులై 26న నీట్.. అదే నెలలో జేఈఈ మెయిన్స్

JEE Mains, Neet Exams will be held on July 26th

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వ్యవస్థలు మొత్తం ఆగిపోయాయి.. విద్యార్ధుల చదువులు దెబ్బతిన్నాయి.. ఆఫీసులు తెరుచుకోవట్లేదు.. పనులు జరగట్లేదు.. విద్యార్థుల వార్షిక పరీక్షలు సైతం నిలిచిపోయాయి. పోటీ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. ఈ క్రమంలోనే కేంద్రం వివిధ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. జులై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్రం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ జులై 26న ఉంటుందని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. పరీక్ష తేదీలు ఇంకా నిర్ణయించలేదు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కొత్త తేదీలు ఈ వారంలో ప్రకటిస్తారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షల కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. నీట్ కోసం 15.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని తాజా వార్తలు