లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మా గోల మాదే : ఫ్రెండ్లీ మీటింగ్ అన్న జీవితా రాజశేఖర్

Published

on

Jeevitha Rajasekhar Responds on MAA Controversy

సినీ తారలు మా గోల మాదే అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కేంద్రంగా రచ్చ రచ్చ చేస్తున్నారు. మా అధ్యక్షుడు నరేశ్‌పై ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీలైనే రాజశేఖర్‌ జీవిత వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడటం లేదంటూ మా సభ్యులను సమావేశపరిచింది.

2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం మా సభ్యుల మీటింగ్‌ ఉందంటూ జీవితా రాజశేఖర్‌ మెస్సేజ్‌ ఇవ్వడం నరేశ్‌ కార్యవర్గాన్ని షాక్‌కు గురిచేసింది. అయితే కోర్డు ఆర్డర్‌ ప్రకారం ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని… కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని మా సెక్రటరీ జీవితా రాజశేఖర్‌ తెలిపారు. మా సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకునేందుకే సమావేశమయ్యామని అన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ద్వారా పరిష్కారం కానందునే.. బోర్డు సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు.
అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్‌ ఎలా పెడతారని నరేశ్‌ తరఫు లాయర్‌ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసోసియేషన్‌ మీటింగ్‌ కూడా గందరగోళంగా జరిగింది. చాలామంది సభ్యులు అలిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

కొత్త కార్యవర్గం ఏర్పడి ఆర్నెల్లు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఫండ్స్‌ కలెక్ట్‌ చేయలేదని… చాలా రోజుల్నుంచి నరేశ్‌ మీటింగ్స్‌కు రావడం లేదని రాజశేఖర్‌ కార్యవర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా మూలధనం ఐదున్నర కోట్లు ఏమయ్యాయని అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు. గతంలో మూలధనాన్ని కదపకుండా ఈవెంట్స్‌ స్పాన్లర్ల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారని… కానీ నరేశ్‌  మూలధనం నుంచే ఖర్చులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

మా అసోసియేషన్‌లో చిన్న చిన్న వివాదాలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేశారన్నారు సినీ నటుడు ఉత్తేజ్‌. మా అభివృద్ధి ఆగిపోయిందని దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్లు వేసి గెలిపించిన మా సభ్యులకు ఈ విషయాలు తెలియాలనే ఫ్రెండ్లీ మీటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు ఉత్తేజ్‌.
Read More : బ్యాక్ టు స్కూల్ : కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *