Jeff Bezos' India experience: Flying kites and $1 billion investment

ఢిల్లీలో గాలిపటాలు ఎగురేసిన అమెజాన్ సీఈవో…భారత్ లో 7వేల కోట్లు పెట్టుబడులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భారత్ లోని చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువైన మేకిన్‌ ఇండియా ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా ఎగుమతి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని తెలిపారు.

డైనమిజం, శక్తి,వృద్ధి భారత్ లో ఉందన్నారు. భారత్ చాలా ప్రత్యేకమైనదని, భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశమని జెఫ్ బెజోస్ అన్నారు. 21వ శతాబ్దం భారత్,అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాల మధ్య మరింత సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సంభవ్ సదస్సు అనంతరం జెఫ్ బెజోస్ ఢిల్లీలో చిన్నారులతో కలిసి ఆయన గాలి పటాలను ఎగుర వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జెఫ్‌ బెజోస్‌ భారత సంప్రదాయ కుర్తా ధరించి చిన్నారులతో కలిసి ఉషారుగా గాలి పటాలను ఎగుర వేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేయగా ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. లక్షలకు పైగా వ్యూస్, లైక్ లతో జెఫ్ బెజోస్ గాలి పటాలు ఎగురవేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.

మంగళవారం ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే రాజ్ ఘాట్ కి వెళ్లి మహాత్మగాంధీకి నివాళులర్పించి తన భారత పర్యటన ప్రారంభించిన జెఫ్ బెజోస్….తన భారత్‌ పర్యటనలో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, చిన్న తరహా వ్యాపారులతో సమావేశం కానున్నారు. అయితే ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యొక్క వ్యాపార పద్ధతులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించిన సమయంలో జెఫ్ బెజోస్ భారత పర్యటన చాలా కీలకంగా మారింది.

మరోవైపు 300 సిటీల్లో వేలమంది చిరు వ్యాపారులు జెఫ్ బెజోస్ భారత పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలకు ఫ్లాన్ చేశారు. భారతీయ ఇ-కామర్స్ మార్కెట్… అన్ని అవాంతరాలు, అనారోగ్య, అన్యాయమైన వ్యాపార పద్ధతుల నుండి విముక్తి పొందాలని తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకునే వరకు తమ జాతీయ ఆందోళన కొనసాగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. 

Related Posts