Jeff Bezos, Wife Divorcing After 25 Years "Of Loving Exploration"

25 ఏళ్ల బంధానికి బ్రేక్ : విడిపోయిన అమెజాన్ దంపతులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఆమన భార్య మెకన్ జీ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు. 25 ఏళ్ల వివాహబంధం ముగిసినట్లు భార్యాభర్తలిద్దరూ ప్రకటించారు. సుదీర్ఘంగా ఆలోచించన తర్వాతే తామిద్దరం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని, విడాకులు తీసుకున్నా తాము స్నేహితుల్లానే కలిసి ఉంటామని ఈ జంట ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తామిద్దరం ఒకరినొకరు కలుసుకోవడం అసాధారణమైన అదృష్టం అని, పెళ్లైన నాటి నుంచి తాము కలిసి ఉండటం తామిద్దరి అదృష్టమని భార్యాభర్తలిద్దరూ ట్విట్టర్ ద్వరా తెలియజేశారు. 25 ఏళ్ల తర్వాత మేమిద్దరం విడిపోతామని తెలిసి ఉంటే  ఇదంతా మళ్లీ మేము చేస్తాం భార్యాభర్తలుగా మేమిద్దరం కలిసి ఓ గొప్ప జీవితం అనుభవించాం. మా ఇద్దరికీ పేరెంట్స్ గా, ఫ్రెండ్స్ గా, వ్యాపారంలో పార్లనర్లుగా, అడ్వెంచర్లలో, ప్రాజెక్టులలో అద్భుతమైన భవిష్యత్తు ముందు ఉందని తెలిపారు. టెబుల్స్ మారవచ్చు కానీ మేము ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని తలుచుకొంటాం అని తెలిపారు.
 

Related Posts