భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్స‌వానికి ఎంపికైన ‘జెర్సీ’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగునాట ఘన విజయం సాధించటమే కాక, పలు ప్రశంసలు అందుకుందీ చిత్రం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం అందించారు.Jersey

పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు, జీవితంలో అతను పోరాడి ఓడి గెలిచిన తీరు హృద్యంగా ఈ ‘జెర్సీ’ చిత్రం రూపొందింది. ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ‘జెర్సీ’ చిత్రం ప్ర‌ద‌ర్శితం కానుంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో ఈ ‘జెర్సీ’ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.


Related Posts