లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మోగిన ఎన్నికల నగారా: జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదల

Published

on

Jharkhand Assembly Elections 2019: EC to announced poll schedule

మహా రాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు తర్వాత మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను నేడు విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 27వ తేదీతో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక గడువు ముగుస్తుండగా..  రఘువర్ దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కాలం పూర్తవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది  ఎన్నికల సంఘం.

జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌తో కలిసి బీజేపీ 43 సీట్లలో గెలిచి సంకీర్ణ ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. అప్పడు బీజేపీ 37 స్థానాల్లో గెలిచింది. మిత్ర పక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 5స్థానాల్లో గెలవగా చివరకు పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) కేవలం 18 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్‌కు 8 సీట్లు వచ్చాయి.

అంతకుముందు జార్ఖండ్‌ ముక్తి మోర్చా బీజేపీకి మిత్రపక్షమే అయినా కూడా విభేదాలు రావడంతో 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడు జేఎంఎం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీకి దిగుతుంది. ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి ఈ రెండు పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఎవరికి అయినా  41 సీట్లు అవసరం. 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీ నుంచి ఐదు దశల్లో జరుగుతాయని, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23న జరగనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన జరుగుతుంది. 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 3వ దశ డిసెంబర్ 12న జరుగుతుంది. నాల్గవ మరియు ఐదవ దశలు వరుసగా డిసెంబర్ 16 మరియు డిసెంబర్ 20వ తేదీన జరుగుతాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *