Jharkhand elections First Phase

పోలింగ్ డే : జార్ఖండ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జార్ఖండ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో 2019, నవంబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరుగనుంది. మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి. బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తోంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

జార్ఖండ్ రాష్ట్రంలో మరోసారి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర ఫలితాలు వెల్లడి అవుతాయని పలువురు భావిస్తున్నారు. 2000లో ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం. నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో కలిసి పోటీ చేసిన బీజేపీ 43 స్థానాల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించింది. 
తొలి దశ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

> 3 వేల 906 పోలింగ్ కేంద్రాలున్నాయి. 
> ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 
> 2020 జనవరి 05తో రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. 
> నవంబర్ 30న తొలి దశ పోలింగ్. 
> డిసెంబర్ 07న రెండో దశ. 
> డిసెంబర్ 12న మూడో దశ. 
> డిసెంబర్ 16న నాలుగో దశ.
> డిసెంబర్ 20న ఐదో దశ.
> డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు.
Read More : కొత్త రూల్ : ఆ పని చేస్తే రేషన్ కట్ 

Related Tags :

Related Posts :