ప్రియుడితో కల్సి భర్తను చంపిన భార్య…. ఆమెతో సహా ముగ్గుర్ని చంపిన గ్రామస్తులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం నేరంగా భావించారు ఆ ఊరి ప్రజలు. ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి ఊరివేసి శిక్షించారు. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది.

జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా డెంగార్దిహ్ గ్రామంలో నివసిస్తున్న నీలం కుజూర్ అనే మహిళ,  నోంఘా గ్రామంలో నివసించే సుదీప్ దుండుంగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మారియానస్ కుజూర్ ను హత్య చేయాలని నిశ్చయించుకుంది.సుదీప్ కు ఈ విషయం చెప్పింది. అందుకు ఓకే అన్న సుదీప్ …తన స్నేహితుడైన  పాకి కులూతో కలిసి సెప్టెంబర్ 14, సోమవారం రాత్రి        డెంగార్డిహ్ గ్రామానికి వచ్చాడు. అక్కడ నీలం కుజూర్ ను కలిశారు. రాత్రి నిద్ర పోతున్న సమయంలో ఆమె భర్త మరియానస్ కుజూర్ ను ముగ్గురు కల్సి ఉరి వేసి హత్య చేశారు.

ఇంతలో ఈ వార్త గ్రామంలో తెలిసి పోయింది. గ్రామస్తులంతా ఏకమయ్యారు. పారిపోబోతున్న సుదీప్, పాకి కులూర్,నీలం లను బంధించారు. ముగ్గురిని ఉరి తీశారు. తమ గ్రామావికి చెందిన వివాహిత మహిళ పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపింది అంటే అది మా గ్రామానికే అవమానం అని ఒక గ్రామస్తుడు వ్యాఖ్యానించాడు.సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి నాలుగు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ముగ్గురిని హత్య చేసిన వారి కోసం గాలింపు చేపట్టారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

Related Posts