jharkhand-transgender-mom-rajakumari-kinner-raising-orphans.1

అనాథలకు అమ్మలా మారిన హిజ్రా…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ కంప్యూటర్ యుగంలో కూడా సమాజంలో హిజ్రాలంటే వివక్షపోవటం లేదు. ఎందుకంటే హిజ్రాల్లో కొంతమంది చేసే చిల్లరి చేష్టల వల్ల వారిపై ఆ ముద్ర పడిపోయింది. కానీ హిజ్రాలంతా అటువంటివారు కాదు.పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తమకు కూడా మంచీ మానవత్వం..ఉందని నిరూపిస్తున్నారు. అటువంటి మంచి మనస్సున్న హిజ్రా రాజకుమారి కిన్నర్. ఆమెది జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా రితూది గ్రామం. అనాథ పిల్లలకు అమ్మగా మారింది. తన సంపాదనలో చాలా భాగంగా అనాథ పిల్లల ఆకలి తీర్చటానికి ఖర్చు చేస్తుంది ఈ హిజ్రా అమ్మ.

Rajakumari

చెడు బుద్ధులు కాలగర్భంలో కలసిపోతాయి. మంచి అనేది కలకాలం నిలిచిపోతుంది. హిజ్రా రాజకుమారి కిన్నర్ చేసే పని కూడా హిజ్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కోట్లున్న ధనవంతులు కూడా అనాథలకు పట్టెడన్నం పెట్టనివాళ్లుంటారు. కానీ హిజ్రా అయినా 8 మంది అనాథ పిల్లలకు తల్లి అయ్యింది కరాజకుమారి కిన్నర్.
హిజ్రాలను ఏహ్యభావంతోనే మరో దృష్టితోనూ చూసే ప్రజలు కూడా 55 ఏళ్ల రాజకుమారి కిన్నర్ ను మాత్రం చాలా గౌరవంగా చూస్తారు. రితూది గ్రామస్థులంతా ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఎందుకంటే ఆమెకు ఉన్న మంచి మనస్సే ఆమెకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది.నిరుపేదలకు ఆహారంపెడుతుంది. బట్టలు ఇచ్చి ఆదుకుంటోంది. కష్టం వచ్చినవారికి నేనున్నానని నిలబడుతోంది.

హిజ్రాలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అలా నమ్మిన చాలామంది తమ ఇంటిలో శుభకార్యాలు ఉన్నప్పుడు రాజకుమారిని పిలిచి ఆశీర్వాదం తీసుకుంటారు. తమ స్థాయికి తగినట్లు కానుకలిచ్చి పంపిస్తారు. అలా రాజకుమారి అంటే ఉన్న గౌరవంతో ధనవంతులు కూడా పిలుస్తారు. అలా డబ్బు, వెండి నగలు..కొంతమంది బంగారాన్ని కూడా కానుకలుగా ఇస్తారు. కేవలం దాని మీదనే ఆధారపడకుండా రాజకుమారి పనులు చేసి డబ్బు సంపాదిస్తుంటుంది. అంతే తప్ప చేయి చాచి ఎవర్నీ ఒక్కపైసా కూడా అడగదు. అలా తనకు వచ్చిన ఆదాయంతో ఎనిమిదిమంది పిల్లల ఆలనాపాలనా చూస్తోంది.

ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ..తాను హిజ్రా అని తెలుసుకుని తన కన్నవారే ఇంట్లోంచి గెంటేశారు. బ్రతకటానికి..కడుపు నింపుకోవటానికి ఎన్నో కష్టాలు పడ్డాను.కానీ ఎవ్వరి ముందు చేయి చాపి ఒక్క పైసా కూడా అడుక్కోలేదు..అవమానాల మధ్య కూడా పస్తులున్నాను తప్ప చేయి చాచలేదు. కష్టపడి పనిచేసి కడుపు నింపుకునేదాన్ని.కష్టం విలువ నాకు తెలుసు..నా అన్నవారు లేక సమాజంలో ఎన్ని కష్టాలు పడాలో స్వయంగా అనుభవించాను. కానీ నాలా ఎవరూ అనాథలుగా ఉండకూడదనే ఉద్ధేశ్యంతో చెత్తకుండీల్లో, ఆస్పత్రుల వద్ద, వీధుల్లో వదిలేసిన పిల్లలను తెచ్చుపెంచుకుంటున్నానని చెప్పింది. వారిలో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలకు రాజకుమారి అంటే విపరీతనమైన అభిమానం. సొంత అమ్మకంటే మిన్నగా చూసుకుంటోందని చెబుతారు.

READ  రోడ్డెక్కితే జైలుకే.. మహా ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజకుమారి తన కూడబెట్టిన డబ్బుతో (పెంచుకున్నవారు) కూతుళ్లకు, పెద్ద కొడుక్కి పెళ్లి చేసింది. మరో ముగ్గురు పిల్లలను చదివిస్తోంది. వాళ్లు మా అమ్మ్ పడే కష్టాల్ని చూస్తున్నాం..మాకోసం ఆమె పడే తపన చూస్తున్నాం..ఆమె కష్టాన్ని వృథా కానివ్వం..‘నేను పెద్దయ్యాక ఇంజినీరును అవుతాను. మా అమ్మలా అందరికీ సాయం చేస్తాను..’ అంటాడు రాజకుమారి 13 ఏళ్ల కొడుకు శుభమ్.

సమాజంలో మంచీ చెడూ రెండూ ఉన్నాయని గుర్తుచేసేలా.. రాజకుమారి పిల్లలను పెంచుకోవడం తోటి హిజ్రాలకు ఇష్టం లేదు. అటువంటి కష్టాలు బంధాలు నీకెందుకు అని అడుగుతుంటారు. వారిని వదిలేయ్..బ్రతినంత కాలం హాయిగా బతుకు అని చెబుతుంటారు. కానీ రాజకుమారి మాత్రం విని నవ్వి ఊరుకుంటుందంతే. ఆ నవ్వులోనే అర్థం అవుతుంది ఆమె మంచి మనస్సు ఏంటో.

Related Posts