లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఐదుగురు బిడ్డల తల్లిపై..17మంది అత్యాచారం..చావు బతుకుల్లో బాధితురాలు

Published

on

jharkhand Woman Gang raped by 17 Mens : దేశంలో ఆడపుట్టుకలపై జరుగుతున్న హేయమైన హింసల ఘటనలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. బైటకెళ్లిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో లేరోననే భయాందోళనలు కొనసాగుతున్నాయి. హత్యలు, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఓ తల్లిపై దారుణమైన అత్యాచారానికి ఒడిగట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17మంది ఐదుగురు పిల్లల తల్లిపై దారుణమైన అత్యాచారంచేశారు. భర్తకళ్లముందే ఇంతటి దారుణం జరుగుతున్నా..అతను ఆ కామాంధులను ఏమీ చేయలేని నిస్సహాయం స్థితిలో ఉండిపోయిన ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.వివరాల్లోకి వెళితే..ఆమె ఐదుగురు బిడ్డల తల్లి. భర్తతో కలిసి ఒక పనిమీద బయటకు వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో వారిని ఒక గుంపు అడ్డుకున్నారు. వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టారు. నడిరోడ్డుపై వారి వీరంగాన్ని చూసిన ఆ భార్యాభర్తలిద్దరూ..భయపడిపోయారు. నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ సదరు వ్యక్తులు అసభ్యకరమైన మాటలతో వేధించారు. అయినాసరే వాళ్లు పెదవి విప్పలేదు. భయపడితూనే ఇంటి వరకూ వచ్చేశారు. హమ్మయ్యా..ఇంటికి వచ్చేశాం ఇక భయం లేదని ఊపిరి పీల్చుకున్నారు.కానీ..వారిని వెన్నంటి వచ్చిన ఆ గుంపు జనం రెచ్చిపోయారు. వారిని వెంబడించి ఇంటికే వచ్చేశారు. ఇంటికి వచ్చేశామనే ధైర్యంతో ఆమె భర్త వారిని దయచేసి మమ్మల్ని వదిలేయండీ అంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో వాళ్లు మరింత రెచ్చిపోయారు. భర్తను దారుణంగా కొట్టారు. 17మంది గుంపుగా వచ్చి మీద పడటంతో పాపం ఆ భర్త ఏమీ చేయలేకపోయాడు. కర్రలు, రాడ్లతో దౌర్జన్యం చేశారు.దయచేసిన నా భర్తను వదిలేయండి అని ఆమె వారిని వేడుకుంది. కాళ్లా వేళ్లా పడింది. కానీ ఆ దుర్మార్గులు కనికరించలేదు. ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇదంతా భర్త ఎదురుగుండానే జరిగింది. జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో ముఫిసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిన ఈ దారుణం ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది.


పాపం బాధ భరించలేక..నొప్పి తట్టుకోలేక ఆమె అరిచింది. నన్ను వదిలేయండన్నా..అంటూ వేడుకుంది. కానీ ఆ దుర్మార్గుల్లో ఒక్కరికి కూడా కనికరం కలుగలేదు. ఒకరి తర్వాత ఒకరు.. మొత్తం 17మంది వెళ్లి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.ఇప్పటికే ఐదుగురు బిడ్డల తల్లి అయిన ఆ మహిళ.. తాజా ఉదంతంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ దారుణ మారణకాండ అనంతరం బాధిత కుటుంబం బుధవారం (డిసెంబర్ 9,2020) పోలీసులకు ఫిర్యాదు చేసింది.


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ లో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కానీ అంత దారుణ హింసకు గురైన ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.