లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

జియో కొత్త చీపెస్ట్ ప్లాన్ వచ్చింది.. 84 రోజులు ఎంజాయ్ చేయండి!

Published

on

Reliance Jio 84 day cheapest Plan : ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త చీపెస్ట్ ప్లాన్‌తో జియో ముందుకొచ్చింది. 84 రోజుల పాటు నిరంతరాయంగా ఏదైనా నెట్ వర్క్ కు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 6GB డేటాను కూడా పొందవచ్చు. రోజుకు 100SMSలు ఉచితంగా పొందవచ్చు. అన్ని జియో యాప్స్ ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

మాకు డేటా అవసరం లేదు.. కేవలం కాల్స్ మాత్రమే ఎక్కువగా కావాలి అనుకునేవాళ్లకు ఇది చీప్ అండ్ బెస్ట్ ఆఫర్.. ఇంతకీ జియో అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఎంతో తెలుసా? రూ.329 ప్లాన్. లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో అందిస్తోంది. 84 రోజుల పాటు జియో నుంచి కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.

ప్రస్తుత రోజుల్లో ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అందులోనూ రీఛార్జ్ ప్లాన్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వాయిస్ కాల్స్ కంటే డేటా అధికంగా అందిస్తున్నాయి. డేటా కాకుండా కేవలం కాల్స్ మాత్రమే ఎక్కువగా చేసుకోవాలని అనేవాళ్లకు జియో అందించే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.

ఒకవేళ మీకు జియోలో రూ.329 రీచార్జ్ ప్లాన్ కనిపించలేదంటే.. జియో వెబ్ సైట్లోకి వెళ్లండి. లేదా My Jio యాప్ లోకి వెళ్లి Others సెక్షన్ ఓసారి చెక్ చేసుకోండి. అక్కడ మీకు మూడు రీఛార్జ్ ప్లాన్లు కనిపిస్తాయి. అందులో రెండోప్లాన్ రూ.329 ప్లాన్.. ఇదే ఉంటుంది.

ఇటీవలే రిలయన్స్ జియో.. రూ.153 జియో ఫోన్ రీఛార్జ్ ప్లాన్ నిలిపివేసింది. ఈ ప్లాన్ కింద రోజూ 1.5GB డేటాను 28 రోజుల కాలపరిమితిపై అందించేది. ఇప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ స్థానంలో జియో మరో రూ.155 ప్లాన్ తీసుకొచ్చింది. రోజూ 1GB డేటాను పొందవచ్చు. ఈ 2021 కొత్త ఏడాదిలో జియో IUC ఫీజును ఎత్తేసింది. జియో కస్టమర్లు ఇప్పుడు అన్ని నెట్ వర్లకు అన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.