లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్ కాల్స్ ఫ్రీ!

Published

on

డేటాకు మాత్రమే ఛార్జీ.. జీవితకాలం ఉచిత కాల్స్ నినాదంతో సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చిన రిలయన్స్ జియో.. ఆ నినాదానికి కొంతకాలం విరామం ఇవ్వగా.. మరోసారి ఆఫ్‌లైన్ దేశీయ కాల్‌లను ఉచితం చేయబోతోంది రిలయన్స్ జియో. జనవరి 1వ తేదీ నుంచి అన్నీ లైవ్ కాల్స్ ఉచితం అని కంపెనీ ప్రకటనచేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఇంటర్‌కనెక్ట్ వినియోగ ఛార్జీలు(IUC) ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

జనవరి 2021 నుండి జియో మరోసారి అన్ని ఆఫ్‌లైన్ కాల్‌లను ఉచితం చేస్తోంది. రిలయన్స్ జియో ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్లో కూడా కనిపించింది. ఈ ప్రకటనతో జియో అతిపెద్ద ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్ షేర్లు రెండు శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2019లో టెలికాం రెగ్యులేటర్ TRAI నిర్ణయం తీసుకున్న తరువాత, Jio తన వినియోగదారుల నుండి ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలను (IUC) సేకరించడం ప్రారంభించింది.

ఈ నిర్ణయంతో జనవరి 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్‌చేసినప్పుడు కాల్‌ అందుకున్న నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జెస్‌ అంటారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. అయితే జీవితకాలం ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందిస్తామనే నినాదంతో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో.. IUC విధానాన్ని తొలగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఐయూసీ అమలును మరింతకాలం పొడగిస్తూ 2019 సెప్టెంబరులో ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జియోపై అదనపు భారం పడటంతో కంపెనీ కూడా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై ఛార్జీలు విధించింది. అయితే ఐయూసీ అమల్లో ఉన్నంతకాలమే ఛార్జీలు వసూలు చేస్తామని జియో అప్పట్లోనే హామీ ఇచ్చింది.